రెండే రెండు మాటల్లో పవన్ కళ్యాణ్ పరువు తీసేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆయన తెలుగు భాష, హిందుత్వం, కులం అంశాలపైనా , అలాగే సీఎం జగన్ రెడ్డి అంటూ చేసిన కామెంట్స్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ప్రతిరోజు ఏ చిన్న అవకాశం దొరికినా సీఎం జగన్ మీద విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి


మంత్రులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తి మాట్లాడితే తాము పట్టించుకునేది లేదంటూ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఓడిపోయాడని, దాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఇక తాజాగా ఇదే విషయంపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేపనిగా క్లాస్ చెప్పకుండా పవన్ కళ్యాణ్ కు గట్టి ఝలక్ ఇచ్చారు.

రెండు మాటల్లో పవన్ స్థాయి చెప్పిన చెవిరెడ్డి

రెండు మాటల్లో పవన్ స్థాయి చెప్పిన చెవిరెడ్డి

రెండే రెండు ముక్కలలో పవన్ కళ్యాణ్ పరువును గంగలో కలిపారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయాడని, రెండుసార్లు గెలిచిన తాను, రెండుసార్లు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మీద మాట్లాడడం ఏంటి ? అయినా ఓడిన వాని గురించి ఏం మాట్లాడాలి సారీ అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండే రెండు మాటల్లో పవన్ కు పంచ్ ఇచ్చారు.

ఓడిపోయారని,కనీసం ఎమ్మెల్యే కూడా కాదని పవన్ ను టార్గెట్ చేస్తున్న వైసీపీ

ఓడిపోయారని,కనీసం ఎమ్మెల్యే కూడా కాదని పవన్ ను టార్గెట్ చేస్తున్న వైసీపీ

గత ఎన్నికల్లో భీమవరం నుండి, గాజువాక నుండి రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోర ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై ఆయన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఓటమిని గుర్తు చేస్తూ వైసిపి నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి కనీస ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోయారని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎద్దేవా చేస్తున్నారు. ఇవి జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఒకింత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం జగన్ పై వాగ్బాణాలు సంధిస్తూనే ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో పవన్ పర్యటన .. టమాటా రైతులతో పవన్

చిత్తూరు జిల్లాలో పవన్ పర్యటన .. టమాటా రైతులతో పవన్

మరోపక్క చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డ్ లో టమోటా రైతుల సమస్యలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి మతమార్పిడులపై ఉన్నంత ఉత్సాహం రైతుల సమస్యలు తీర్చడంపై లేదని విమర్శించారు.రైతు సమస్యల పరిష్కారం కోసం తానూ తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జగన్ పాలనలో కనీసం రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పవన్ వ్యాఖ్యలకు వైసీపీ రివర్స్ పంచ్ లు వేస్తూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+