రోజురోజుకీ ఘోరంగా పడిపోతున్న చికెన్ ధరలు ..కేజీ రూ. 60.. రీజన్ ఇదే
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఒకపక్క కరోనా వైరస్ ప్రభావం, మరోపక్క హెర్సిస్ వైరస్ ప్రభావంతో కోళ్ళు తినాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇక చికెన్ షాపుల వాళ్ళు గిరాకీ లేక ఆఫర్లు పెడుతున్నా కొనేవారు లేక చికెన్ నిన్నా మొన్నటి దాకా 100రూపాయలు ఉన్న ధర కాస్తా ఇప్పుడు 60రూపాయలకు పడిపోయింది.
తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్, అటు హెర్సిస్ వైరస్ వల్ల కోళ్ళకు వచ్చే లంపీ స్కిన్ డిసీజ్ ప్రభావం చికెన్ అంటేనే భయపడేలా చేసింది .గత కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ కేజీ రూ.180 నుంచి 200 రూపాయలు పలికేది. నిన్నా మొన్నటి దాకా 100 రూపాయలుగా ఉంది . కానీ ఇప్పుడు రిటైల్‌గా 60 రూపాయలకి చికెన్ ధర పడిపోయింది. చికెన్ తింటే కరోనా వ్యాధి వస్తుందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీని కారణంగా పౌల్ట్రీ రంగానికి చెందిన వ్యాపారులు తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ఘోరంగా కుదేలైంది .

ఈ ప్రచారాలు జరగా ముందు రోజుకు 700 నుంచి 800 కిలోల చికెన్ వ్యాపారం జరిగేది. ఆదివారాలైతే 1500 కిలోలకు పైగా అమ్మకాలు ఉండేవి. కానీ ఇప్పుడు 20 శాతం పడిపోయిందంటున్నారు వ్యాపారులు. ఇక కరోనా వైరస్ కారణంగానే తమ వ్యాపారాలు పడిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క అధికారులు అలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రచారం చేస్తున్నా ప్రజల్లో ఉన్న భయం మాత్రం పోవటం లేదు. దీంతో డిమాండ్ లేక చికెన్ ధర ఘోరంగా పడిపోయింది .
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications