అమరావతికి తరలివచ్చిన కేంద్ర ఎన్నికల కమీషన్ కార్యాలయం
అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చేసింది. సచివాలయం ఐదో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
అయితే అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేసినా మరో నెల రోజులు హైదరాబాద్ నుంచే ఎన్నికల కమీషన్ పూర్తి స్థాయి కార్యకలాపాలు జరుగుతాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ కేంద్రంగానే పనిచేసిన ఏపీ ఎన్నికల కమిషన్ కార్యాలయం వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మాత్రం అమరావతి వేదికగా పనిచేయనుంది. ఈలోగా హైదరాబాద్ నుంచి పూర్తి వ్యవస్థను సచివాలయానికి తరలించనున్నారు.

Recommended Video

చంద్రబాబుతో భారత రాయబారి భేటీ
ఎన్నికల కమిషన్ కార్యకలాపాలు ఇక మీదట అమరావతి నుంచే సాగుతాయని ఏపీ ఎన్నికల కమిషనర్ సిసోడియా తెలిపారు. అయితే అమరావతి నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు మరో నెల రోజులు పడుతుందని సిసోడియా తెలిపారు.












Click it and Unblock the Notifications