ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారులు వీరే! తలశిల రఘురామ్‌కు చోటు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో.. ఆయనకు నలుగురు ప్రత్యేకాధికారులను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన తలశిల రఘురామ్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకాధికారుల్లో చోటు కల్పించారు.
ఆయనతో పాటు మరో ముగ్గురికి పదవులు కేటాయించారు. ప్రత్యేక అధికారిగా కృష్ణ దువ్వూరు, ప్రత్యేక కార్యదర్శిగా డాక్టర్ ముక్తాపురం హరికృష్ణ, కార్యనిర్వాహక సహాయకునిగా అవినాష్ ఇరగవరపులను నియమించారు. ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాల సమన్వయకునిగా తలశిల రఘురామ్‌కు బాధ్యతలను అప్పగించారు.













Click it and Unblock the Notifications