బాబు సమక్షంలో ఎంవోయూ కుదిరింది: ఏపీలో సోలార్ విద్యుత్ ప్లాంట్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చైనా సంస్థ జియాన్ లాంగి సిలికాన్ మెటీరియల్స్ మధ్య ఢిల్లీలో పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం చిత్తూరుకు సమీపంలోని శ్రీసిటీలో జియాన్ లాంగి సంస్థ సౌర విద్యుత్ ఫలకాల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది.
ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీసిటీ ప్రైవేట్ లిమిటెడ్, జియాన్‌లాంగి మెటీరియల్స్ కార్పోరేషన్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు.
శ్రీసిటీలోని 60 ఎకరాల్లో రూ.1600 కోట్లతో జియాన్‌లాంగి ఈ యూనిట్ ఏర్పాటవుతుంది. ఈ ఎంవోయూపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ యూనిట్ వల్ల ఎలాంటి హాని ఉండదన్నారు.

స్కేల్, స్కిల్, స్పీడ్ నినాదాలతో చైనా ముందుకెళుతోందన్నారు. రెండంకెల వృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అపార వనరులున్నాయన్నారు. సాంకేతికత వృద్ధితో సౌర విద్యుత్తు ధర తగ్గిందన్నారు.
ఏపీలో పారిశ్రామిక అనుమతుల కోసం సింగిల్ డెస్క్ విధానాన్ని అమలుచేస్తున్నామన్నారు. అక్టోబర్ 22న నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications