ఇలాఐతే ఎలా: కామినేనిపై చినరాజప్ప సీరియస్, అందరి ముందే నిలదీత
తూర్పుగోదావరి: వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌పై హోంమంత్రి చినరాజప్ప సీరియస్ అయ్యారు. గురువారం సామర్లకోట ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన.. మొదట డీఎంహెచ్ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత అందరిముందే మంత్రి కామినేనికి ఫోన్ చేశారు. స్పీకర్ ఆన్ చేసి ఆస్పత్రికి నిధులు విడుదల చేయడంలో ఎందుకు ఆలసత్వం ప్రదర్శిస్తున్నారని నిలదీశారు.

సామర్లకోట ప్రభుత్వాసుపత్రి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి చినరాజప్ప కొంత అసహనం వ్యక్తం చేశారు. అంతేగాక, ఇలాగైతే తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలంటూ నిలదీశారు.












Click it and Unblock the Notifications