పవన్ కళ్యాణ్‌కు అంత సీన్ లేదు, అందుకే కాంగ్రెస్ పార్టీతో: చినరాజప్ప
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి పవన్ కళ్యాణ్ సహకరించారే తప్ప.. తాము అధికారంలోకి రావడానికి ఆయన కారణం కాదని అన్నారు.
టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేంత సీన్ పవన్ కళ్యాణ్‌కు లేదని చినరాజప్ప వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సోమవారం పోలీసుల గృహ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావు ఆయన అభిమానేనని చినరాజప్ప అన్నారు. ఇప్పటికే నిందితుడిని పలుమార్లు విచారించామని తెలిపారు. శ్రీనివాసరావును మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనే ఈ దాడి చేసినట్లు నిందితుడు చెబుతున్నాడని చినరాజప్ప తెలిపారు. శ్రీనివాసరావు తగిన భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని సమర్థిస్తున్నట్లు చినరాజప్ప తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీతో జత కట్టాల్సి వచ్చిందని తెలిపారు.
-
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications