మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్న చింతమనేని ప్రభాకర్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసిపి మంత్రులు, నేతలు చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే, దానికి టిడిపి నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇక తాజాగా మంత్రి రోజా చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై వ్యాఖ్యలు చేశారు.

బండారు సత్యనారాయణపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇక తాజాగా మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమర్ధించారు. బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలలో తనకు తప్పు ఏమీ కనిపించడం లేదని అన్నారు. గతంలో వైసిపి నేతలు అసెంబ్లీలోని తెలుగుదేశం పార్టీ నాయకులపై అసభ్య వ్యాఖ్యలు చేశారని, బండారు సత్యనారాయణ తప్పుపడుతున్న నేతలంతా అప్పుడు ఏమయ్యారు అంటూ ప్రశ్నించారు.

chintamaneni prabhakar support to bandaru sathyanarayana comments on roja

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అసమర్థ పాలనను ప్రశ్నిస్తున్న విపక్ష నేతలను తప్పుడు కేసులలో ఇరికించడం , జైల్లో పెట్టడం పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. గతంలో నిండు అసెంబ్లీలో టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, టిడిపి మహిళా మంత్రులను నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు తప్పుగా కనిపించలేదు కానీ ఇప్పుడు రోజాపై సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తప్పుగా కనిపిస్తున్నాయా అంటూ చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు.

స్పీకర్ ను పక్కన పెట్టుకొని నోటికొచ్చినట్టు గతంలో మాట్లాడినప్పుడు ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఎందుకు ఖండించ లేదని నిలదీశారు. చిన్న స్థాయి నేతల నుంచి, మాజీ ముఖ్యమంత్రి వరకు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణిచి వేస్తుందని విమర్శించారు. బండారు సత్యనారాయణ మూర్తికి పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మీరంటే తప్పు లేదు.. మీరు మాట్లాడిన దాన్ని ఖండిస్తే తప్పా అంటూ ప్రశ్నించారు. బండారుకు టీడీపీ అండగా ఉంటుందని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+