Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవి-మోహన్ బాబు ఒకే వేదిక మీదకు : సీఎం జగన్ నిర్ణయాలపై: కలుస్తారా - విభేదిస్తారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక కీలక భేటీకి రంగం సిద్దమైంది. మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకే వేదిక మీదకు రానున్నారు. ఒకే అంశం పైన మాట్లాడనున్నారు. ఇందుకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదిక కానుంది. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు అన్ని విభాగాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నానికి ఈ సమావేశం నాంది కానుంది.

ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కీలక సమావేశం జరగనుంది. కరోనా సమయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్న అనేక ఆటంకాలతో పాటు ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

ఆ ఇద్దరి పైన ఫోకస్

ఆ ఇద్దరి పైన ఫోకస్

ఫిలిం ఛాంబర్లోని అన్ని సంఘాలకు సంబందించిన దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజలతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్​లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ , డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ , స్టూడియో సెక్టార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ , ఫిల్మ్ ఫెడరేషన్ , డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలను సమావేశానికి ఆహ్వానించారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్​తో చిరంజీవి భేటీ కంటే ముందు ఈ సమావేశం జరగాల్సి ఉండగా రెండుసార్లు వాయిదా పడింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ ఈ నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేయనున్న క్రమంలో ఈ సమావేశం కీలకంగా మారింది.

ఆహ్వానాలపై చర్చ ఉంటుందా

ఆహ్వానాలపై చర్చ ఉంటుందా

మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ అంశాల పైన ఒక సారి పర్సనల్ గా సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో తనను ఆహ్వానిస్తేనే.. వచ్చానని చెప్పుకొచ్చారు. ఇక, సినీ హీరోలు మహేష్ బాబు.. ప్రభాస్ తో పాటుగా కొరటాల శివ.. రాజమౌళితో..నారాయణ మూర్తితో కలిసి మరోసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

ఆ సమయంలో సినీ పరిశ్రమ అంశాల పైన సీఎం హామీ ఇచ్చారని..అన్ని అంశాలకు పరిష్కారం దొరికిందని సమావేశంలో పాల్గొన్న హీరోలు చెప్పుకొచ్చారు. సమావేశ వివరాలను ఇండస్ట్రీ పెద్దలకు వివరించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని చిరంజీవి అప్పట్లోనే చెప్పారు. దీనికి అనుగుణంగా ఈ రోజు సమావేశంలో సీఎంతో జరిగిన చర్చలు..నిర్ణయాల గురించి చిరంజీవి వివరించనున్నారు.

కలుస్తారా...విభేదిస్తారా

కలుస్తారా...విభేదిస్తారా

అయితే, మోహన్ బాబు కు సైతం సీఎం తో సమావేశానికి ఆహ్వానం ఉందని..కానీ, ఆ విషయాన్ని కొందరు తన తండ్రికి చెప్పలేదని..ఎవరు అలా చేసారో కూడా తమకు తెలుసంటూ మంచు విష్ణు వ్యాఖ్యానించారు. మరి..ఈ సమావేశంలో ఆ అంశాన్ని ప్రస్తావిస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో పాటుగా పలువరితో అభిప్రాయ సేకరణ చేసి నివేదిక సిద్దం చేసింది.

దీనిని ముఖ్యమంత్రి జగన్ కు సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సినీ పరిశ్రమ అంశాల పైన తుది నిర్ణయం తీసుకోనుంది. దీనికి ముందుగా జరగుతున్న ఈ సమావేశంలో సీఎం సమక్షంలో జరిగిన నిర్ణయాల పైన చిరంజీవి వివరించి..ఇండస్ట్రీ పెద్దల అభిప్రాయాలను సేకరించనున్నారు.

Recommended Video

    CM Jagan పై టాప్ హీరోలు హర్షం.. ట్రెండింగ్ లో 'Thank You CM Jagan'| Oneindia Telugu
    సమావేశం పై ఆసక్తి

    సమావేశం పై ఆసక్తి

    వాటిని మరోసారి సీఎంతో సమావేశమై వివరించి..తుది ఉత్తర్వులు వచ్చే విధంగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే, సీఎంతో చిరంజీవి జరిపిన చర్చల్లోని అంశాలతో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సమావేశం అవుతున్న వేళ... ఎందరు వాటిని అంగీకరిస్తారు.. ఎంత మంది విభేదిస్తారు... అసలు ఈ సమావేశంలో ఏం జరుగుతుంది.. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ ఇప్పుడు టాలీవుడ్ తో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి పెంచుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+