అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఈరోజు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో సంబరాలు జరుపుకుంటున్నారు.టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు కుప్పం పి.ఈ.ఎస్ మెడికల్ కాలేజీలో నారా భువనేశ్వరి గారి బస కేంద్రంలో ఘనంగా జరిగాయి. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి కేక్ కట్ చేసి, పార్టీ నాయకులతో వేడుకలు చేసుకున్నారు.
చిరంజీవి ఆసక్తికర ట్వీట్
ఇక చంద్రబాబు జన్మదినాన ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబును ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులో అహర్నిశలు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.

అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ,
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2024
ప్రజా సంక్షేమం కోసం పాటుపడే
శ్రీ నారా చంద్రబాబునాయుడు @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 💐
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్
వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేసిన ట్వీట్ తెలుగుదేశం పార్టీ శ్రేణులను సంతోషంతో ముంచెత్తింది. ఇదిలా ఉంటే ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కూడా టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు -
— JanaSena Party (@JanaSenaParty) April 20, 2024
JanaSena Chief Shri @PawanKalyan@ncbn#HBDBabu #HappyBirthdayCBN pic.twitter.com/8tr5A3vy7a
చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ పోస్ట్
రాజకీయంగా, పాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచిస్తారని, రాజకీయ ఒత్తిళ్లు వేధింపులు ఎన్ని ఎదురైనప్పటికీ ఆయన దృఢమైన చిత్తంతో వాటిని ఎదుర్కొంటారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించినప్పుడు, జైల్లో ఉన్న సమయంలో కూడా ఆయన మనో ధైర్యం కోల్పోలేదు అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
రాష్ట్రాభివృద్ధికి దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు
తన పరిపాలన పటిమతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు గారు అంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు సంతోషాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ జనసేనాని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications