పవన్ కళ్యాణ్ పుట్టినరోజున చిరంజీవి భావోద్వేగ పోస్ట్; మహేష్ బాబు స్పెషల్ విషెస్!!

జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు వెల్లువగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన ఒకప్పటి తమ పాత ఫోటోను షేర్ చేశారు. అందులో తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ పైన మెగాస్టార్ చిరంజీవి చేతులు వేసి నిలుచున్నారు. ఆనాటి ఫోటోలు షేర్ చేసి తన తమ్ముళ్ళ పట్ల తన ప్రేమ ఎప్పటికీ ఇదే విధంగా ఉంటుందని తెలియజేసేలా పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.

Chiranjeevi emotional post on Pawan Kalyan birthday; Mahesh Babu Special Wishes!!

ఇక మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పోస్టులో పవన్ కళ్యాణ్ అనుకున్న సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు. జనహితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా, నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడు అయినందుకు గర్విస్తూ నీకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఉద్వేగ భరిత పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే ఆకాంక్షను మెగాస్టార్ చిరంజీవి కూడా వ్యక్తం చేసినట్లుగా జనసేన అభిమానులు భావిస్తున్నారు. చిరంజీవి పూర్తి మద్దతు తమ్ముడు పవన్ కళ్యాణ్ కే నని అభిమానులు ఈ పోస్ట్ తో సంబరాలు జరుపుకుంటున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ అంటూ పేర్కొన్న మహేష్ బాబు రాబోయే సంవత్సరం మీకు అసమానమైన విజయాన్ని మరియు ఆనందాన్ని తెస్తుందని ఆకాంక్షించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+