పవన్ కళ్యాణ్ గొప్పతనం చెప్పి చిరంజీవి ఎమోషనల్ ట్వీట్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఎన్నికలలో పోరాటం చేస్తూ ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సోదరుడు చిరంజీవి తాను బాసటగా ఉన్నానంటూ తాజాగా ఇచ్చిన భారీ విరాళంతో చిరంజీవి జనసేనకు మద్దతుగా ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది.

చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పైన నా తమ్ముడు అంటూ విపరీతమైన ప్రేమను వ్యక్తం చేసే చిరంజీవి ఈసారి ఎన్నికలలో జనసేన పార్టీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ లక్ష్యం కోసం తాను సైతం అంటూ ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని అందించి తన మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ కోసం అందించిన విరాళం గురించి చిరంజీవి ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు.

Chiranjeevi emotional tweet saying the greatness of Pawan Kalyan

పవన్ చేసిన ఆ పని నాకు సంతోషం కలిగించింది
అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. కానీ అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ పేద ప్రజల కోసం నేనున్నానని బాసటగా నిలబడుతున్నారని చిరంజీవి తన పోస్టు ద్వారా పేర్కొన్నారు. అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ తన సంపాదన ని రైతు కూలీల కోసం వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం అని చిరంజీవి వెల్లడించారు.

నేను సైతం జనసేనకి విరాళం ఇచ్చా
తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను అంటూ ఎక్స్ వేదికగా చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఇక ఈ పోస్టులో పవన్ కళ్యాణ్, నాగబాబు చిరంజీవితో మాట్లాడుతున్న, పవన్ కళ్యాణ్ చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకుంటున్న, చిరంజీవి ఎంతో సంతోషంగా తన తమ్ముడికి ఐదు కోట్ల రూపాయల చెక్ అందజేస్తున్న ఫోటోలను పోస్ట్ చేశారు.

పవన్ సేవా దృక్పథాన్ని చెప్పిన చిరంజీవి
ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి పోస్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యాన్ని, పవన్ కళ్యాణ్ సేవా దృక్పధాన్ని, పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. మరి చిరంజీవి కూడా జనసేనానికి మద్దతు ఇస్తున్న క్రమంలో ఈసారి మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ను తమ ఓట్లతో ఆదరిస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+