కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టి: చిరుకు వేములవాడలో షాక్, కెసిఆర్‌పై గంటా ఎద్దేవా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కరీంనగర్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి తెలంగాణ సెగ తగిలింది. చిరంజీవి సతీసమేతంగా కరీంనగర్ జిల్లా వేములవాడకు వచ్చారు. ఈ సమయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) విద్యార్థులు చిరంజీవిని అడ్డుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా, చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చిరంజీవి కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని చుట్టు ముట్టారు. ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వారి పైన లాఠీఛార్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు. చిరంజీవిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను తీసుకు వెళ్లారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ముగిసిన తర్వాత చిరంజీవి తొలిసారి తెలంగాణ ప్రాంతానికి వచ్చారు.

కెసిఆర్‌కు గంటా కౌంటర్

రాష్ట్రపతికి బిల్లు చేరిన తర్వాత కోర్టుకు వెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా చెప్పారు. ప్రభుత్వం తరఫున కోర్టుకు వెళ్లాలా? లేదా సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ పిల్ దాఖలు చేయాలా? అనే విషయంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు.

తెలంగాణ బిల్లు గెలిచే అవకాశం లేదని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా రాజ్యసభ బరిలో దిగిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతిచ్చే విషయంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం తరఫునే ఢిల్లీ నుంచి తిరిగి వస్తానన్న కెసిఆర్ గురించి మాట్లాడుతూ, ఆయన తిరిగి వస్తారో లేక ఢిల్లీలోనే ఉండిపోతారో తెలుస్తుందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాము ఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తామన్నారు.

English summary
Union Tourism Minister Chiranjeevi face Telangana heat at Vemulawada in Karimnagar district on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X