Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొడాలి పకోడీ వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ ఫైర్-గుడివాడలో నిరసన, అరెస్టులు..

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చిరంజీవిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు కూడా మండిపడుతున్నారు. చిరుపై కొడాలి పకోడీ గాళ్లు వ్యాఖ్యల్ని నిరసిస్తూ గుడివాడలో మెగా ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. కొడాలి నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

గుడివాడలో చిరంజీవి ఫ్యాన్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కొడాలి నాని కామెంట్స్ కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. కొడాలి చేసిన పకోడీగాళ్లు వ్యాఖ్యకు నిరసనగా.. చెకోడీ గాడు అంటూ నినదించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ర్యాలీని ముందుకు సాగనివ్వలేదు. ఈ క్రమంలో పలువురు చిరంజీవి అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మిగతా అభిమానులు పోలీసు వాహనాల ముందు పడుకుని వాటిని ముందుకెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.

chiranjeevi fans protest in gudivada against kodali nanis pakodi remarks

మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కృష్ణాజిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డౌన్ డౌన్ కొడాలి నాని... జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్న చిరంజీవి అభిమానులను విజయవాడ వన్ వే రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రోక్తులైన అభిమానులు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

అభిమానుల ర్యాలీని పోలీసులు ముందుకు వెళ్ళనీయకపోవడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. ఆందోళన అడ్డుకునే క్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ తోపాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేయడంతో ముఖ్యనాయకుల వరకూ అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కొడాలి కామెంట్స్ పై ఆగ్రహంతో జనసేన కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+