షాక్ తిన్నా: పవన్ కల్యాణ్ రాజకీయాలపై చిరు, తమ్ముడి రిప్లై
హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల వేడుకల్లో ఆదివారం రాత్రి కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన తమ్ముడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాజకీయాలపై మాట్లాడారు. రాజకీయాలంటూ ప్రత్యేకంగా ప్రస్తావించకుండానే జోడు గుర్రాలపై పయనించాలని సలహా ఇచ్చారు.
రెండు మూడేళ్ల తర్వాత సినిమాలను చేస్తానో లేదో అని పవన్ కల్యాణ్ చెప్పిన వార్తను చదివి తాను షాక్ అయ్యానని చిరంజీవి అన్నారు. సినిమాలు చేయకుండా ఇంత మందిని ఏం చేస్తావని ఆయన అభిమానులను చూపిస్తూ అడిగాడు.

ఏది చేసినా పవన్ కల్యాణ్ ఉన్నత స్థాయిని అందుకుంటాడని, మరో రంగంలోనూ అతను ఆ స్థాయిని అందుకోగలడనే విశ్వాసం ఉందని చిరంజీవి అన్నారు. సినిమాలు వదిలేయకుండానే రెండో రంగంలోనూ పనిచేయాలని ఆయన అన్నారు. జోడు గుర్రాలపై పయనించాలని ఆయన సూచించారు.
తన రాజకీయ ప్రవేశంపై ఆ తర్వాత పవన్ కల్యాణ్ సమాధాన ఇస్తూ - తాను చేసిన పని అన్నయ్యకు నచ్చలేదని అన్నారు. అయితే, అన్నయ్య పంథాను తాను ఎంచుకోలేదని, వేరే పంథాలో పయనించానని, రాజకీయాలు వేర్వేరు వ్యక్తిగతమైన ప్రేమలు వేరని అన్నారు.
తాను ఎందుకు చేశానో అన్నయ్యకు వివరించారని, అన్నయ్యను ఒప్పించానని ఆయన అన్నారు. అన్నయ్య మీద ప్రేమను బహిరంగ వేదికల మీద ప్రకటించడం తనకు ఇష్టం ఉండదని, అన్నయ్య అంటే ఎంత ప్రేమనో తన గుండెల్లో ఉంటుందని, అవసరమైతే ఎలా నిలడుతానో కూడా చూపిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.












Click it and Unblock the Notifications