వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు తనకు సెట్ కావంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు .. పవన్ పార్టీ పై కూడా మెగా సంచలనం

|
Google Oneindia TeluguNews

రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, సినిమాల్లో రాణించినంత గొప్పగా రాజకీయాలలో రాణించలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీ పేరుతో రాజకీయ రంగప్రవేశం చేసిన చిరంజీవి,ప్రభంజనం సృష్టిస్తాడు అనుకున్న అనతికాలంలోనే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజకీయాలలో పట్టును కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పని చేసినప్పటికీ చిరంజీవి కి పెద్దగా గుర్తింపు రాలేదు.

సూపర్ స్టార్ రజనీకాంత్ భగవదనుగ్రహం వల్ల త్వరగా కోలుకోవాలని కోరుకున్న పవన్ కళ్యాణ్సూపర్ స్టార్ రజనీకాంత్ భగవదనుగ్రహం వల్ల త్వరగా కోలుకోవాలని కోరుకున్న పవన్ కళ్యాణ్

రాజకీయాలు తనకు సెట్ కావన్న చిరంజీవి , ఇక నో పాలిటిక్స్

రాజకీయాలు తనకు సెట్ కావన్న చిరంజీవి , ఇక నో పాలిటిక్స్

ప్రస్తుత రాజకీయాలకు దూరంగా, సినిమాలలో బిజీ అయిన చిరంజీవి రాజకీయాలపై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. సమంతా హోస్ట్ గా ఓ ఓటీటీలో నిర్వహిస్తున్న షోలో మాట్లాడిన చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి ఎందుకు వచ్చారు అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వెళ్లిన పదేళ్ళలో చాలా విషయాలు తెలుసుకున్నాను అని, రాజకీయాలు తనకు సెట్ కావని అర్థమైందని చిరంజీవి తేల్చి చెప్పారు. నటుడిగా జీవితం చాలా సంతోషంగా ఉందన్నారు .

పవన్ పార్టీ పై స్పందించిన చిరంజీవి .. విజయం సాధిస్తాడని ఆశాభావం

పవన్ పార్టీ పై స్పందించిన చిరంజీవి .. విజయం సాధిస్తాడని ఆశాభావం

ఇకపై రాజకీయాల జోలికి వెళ్ళబోనని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికలకు ముందు నుండే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న చిరంజీవి మరో జాతీయ పార్టీలో చేరబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి తాజా వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి తెర పడినట్లయింది. పవన్ కళ్యాణ్ పార్టీ పై స్పందించిన చిరంజీవి పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతున్నాడు అని కష్టానికి తగిన ఫలితం పవన్ కు ఖచ్చితంగా వస్తుందని, పవన్ విజయం సాధిస్తారని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

చిరంజీవి పార్టీ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై కూడా ..

చిరంజీవి పార్టీ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై కూడా ..

సినిమాలలో అసమాన ప్రతిభ చూపించి తానేంటో నిరూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలో ప్రభంజనంలా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ముందుకు వచ్చినా, చిరు రాజకీయ ప్రస్థానం గొప్పగా సాగలేదనే చెప్పాలి. మొదటి ప్రయత్నంలోనే చిరంజీవి పార్టీకి 18స్థానాలలో పట్టం కట్టారు ఏపీ ప్రజలు . కానీ చిరంజీవి కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసి తప్పు చేశారని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది . చిరంజీవి ప్రజా రాజ్యం ప్రభావం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీపై కూడా బాగా పడింది . చిరంజీవిలా పవన్ కూడా కొద్ది రోజులు హడావిడి చేస్తాడనే ప్రచారం జరిగింది. కానీ రాజకీయాల్లో పవన్ ఓటమి పాలైనా వదిలిపెట్టకుండా ముందుకు సాగుతున్నాడు.

 సినిమాల్లో సక్సెస్ అయిన చిరంజీవి రాజకీయాల్లో రాణించలేదు.. అందుకే మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ

సినిమాల్లో సక్సెస్ అయిన చిరంజీవి రాజకీయాల్లో రాణించలేదు.. అందుకే మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ

సినిమాల్లో సక్సెస్ అయిన చిరంజీవి, రాజకీయాలలో ఒక రకంగా చెప్పాలంటే అంత గొప్ప పాత్రను పోషించే లేదనే చెప్పాలి. ఏది ఏమైనా తాజా వ్యాఖ్యలతో చిరంజీవి తాను ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే నని తేల్చి చెప్పారు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మళ్లీ సినిమాలు చేయబోనని చెప్పాడు. అయితే ఊహించని విధంగా ఖైదీ నెంబర్ 150 సినిమా తో మళ్లీ సినీరంగంలో రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. సినిమాలు చేయనని చెప్పిన చిరంజీవి, మళ్లీ సినిమాలు చేస్తున్నారని, ఇప్పుడు కూడా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళను అని చెప్తున్నా, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం లేకపోలేదు అన్నది కొందరి వాదన.

English summary
Chiranjeevi, made interesting comments on politics. Chiranjeevi clarified that politics was not set for him.He will not go into politics anymore, expressed hope that Pawan Kalyan would succeed in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X