God Father Movie : గాడ్ ఫాదర్ పై చిరు వ్యాఖ్యల ప్రభావం-తమ్ముడికి మద్దతుతో మంటపుట్టిందిలా..

ఏపీలో ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ తో టచ్ లో ఉంటూ టాలీవుడ్ వ్యవహారాలు నడిపిన చిరంజీవికి తాజాగా ఓ భారీ షాక్ తగిలింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయానికి మద్దతుగా చిరంజీవి ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ..వాటి ప్రభావం మాత్రం తన తాజా చిత్రం గాడ్ ఫాదర్ మూవీపై తొలిరోజే కనిపించింది. దీంతో ఇన్నాళ్లూ చిరుకు మద్దతుగా పోస్టులు పెట్టిన వైసీపీ అభిమానులు ఇప్పుడు గాడ్ ఫాదర్ ను టార్గెట్ చేస్తున్నారు.

 జగన్-చిరంజీవి బంధం

జగన్-చిరంజీవి బంధం

ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి గత మూడేళ్లుగా కలిసి మెలిసి ముందుకు సాగుతున్నారు. టాలీవుడ్ అంతా జగన్ ను అనధికారికంగా బాయ్ కాయ్ చేసిన సందర్భంలో ఆయనకు అండగా నిలవడం ద్వారా చిరంజీవి ఆత్మీయుడిగా మారిపోయారు. దీంతో టాలీవుడ్ వ్యవహారాల్లోనే కాదు ఇతరత్రా కూడా జగన్-చిరు బంధం పెనవేసుకుంది. ఓ దశలో చిరుకు జగన్ రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే అలా జరగలేదు. కానీ చిరు-జగన్ సంబంధాలు మాత్రం అంతా సజావుగానే ఉన్నాయని అనుకుంటున్న తరుణంలో బాంబుపేలింది.

తమ్ముడికి మద్దతుగా చిరు కామెంట్స్

తమ్ముడికి మద్దతుగా చిరు కామెంట్స్

ఓవైపు కాంగ్రెస్ సభ్యత్వం వదులుకోకుండా కొనసాగుతూ, మరోవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్ తో అనుబంధం పెంచుకుంటూ పోయిన చిరంజీవి... ఉన్నట్లుండి తన గాడ్ ఫాదర్ చిత్రం విడుదల నేపథ్యంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఇన్నాళ్లూ పవన్ కు మద్దతిచ్చారో లేదో తెలియదు కానీ గాడ్ ఫాదర్ చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తమ్ముడికే తన మద్దతని బహిరంగంగా ప్రకటించి చిరు కలకలం రేపారు. దీంతో ఇన్నాళ్లూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ను కాదని తమకు అండగా ఉంటారని భావించిన వైసీపీ అభిమానులు కాస్తా హర్ట్ అయ్యారు.

 చిరు కామెంట్స్ తో చిక్కుల్లో గాడ్ ఫాదర్ ?

చిరు కామెంట్స్ తో చిక్కుల్లో గాడ్ ఫాదర్ ?

తమ్ముడికి మద్దతిస్తూ చిరు చేసిన వ్యాఖ్యల ప్రభావం వెంటనే కనిపించింది. తన తాజా చిత్రం గాడ్ ఫాదర్ విడుదల సందర్భంగా తమ్ముడు పవన్ అభిమానుల నుంచి తనకు సపోర్ట్ లభిస్తుందని భావించి చిరంజీవి చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆయనపై నెగెటివ్ గా పడింది. అప్పటివరకూ తమ్ముడితో కలవకుండా జగన్ తోనే ఎక్కువగా కనిపించిన చిరంజీవి.. ఇప్పుడు పవన్ పై ప్రేమ కురిపించే సరికి వైసీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చిరు తమవాడే అని ఇప్పటివరకూ చెప్పుకున్న వైసీపీలో కాపు నేతలు సైతం మెగాస్టార్ తాజా వ్యాఖ్యలతో అవాక్కయ్యారు. అదే సమయంలో వైసీపీ అభిమానులు గాడ్ ఫాదర్ ను సోషల్ మీడియాలో రాడ్ ఫాదర్ అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో అభిమానం ఎప్పుడెటు తిరుగుతుందో తెలియక చిరు తలపట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+