పోలీసుల పనితీరు హ్యాట్సాఫ్ .. ఒక పోలీసు బిడ్డగా సెల్యూట్ చేస్తున్నా : చిరంజీవి
కరోనావైరస్ ప్రపంచ గతిని మార్చేసింది . కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. పోలీసులు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం పహారా కాస్తున్నారు. 24 గంటలు కరోనా కట్టడి కోసం ఇదులు నిరర్తిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం వారు చాలా కష్టపడుతున్నారని ఒక పోలీసు బిడ్డగా సెల్యూట్ చేస్తున్నా అని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఇక ఆ వీడియోలో మెగా స్టార్ చిరంజీవి "ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్ నుంచి స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్‌డౌన్ విజయవంతమతోంది. అలా జరగబట్టే కరోనా విజృంభణను చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే, ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నాను. ప్రజలంతా పోలీసులకు సహకరించండి. పోలీసులు చేస్తున్న పనికి ఓ పోలీసు బిడ్డగా నేను వారికి సెల్యూట్ చేస్తున్నాను" అని చిరంజీవి తన కృతజ్ఞతలను తెలియజేశారు.

ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో సినీ కార్మికుల కోసం వారి ఆకలి బాధలు తీర్చటం కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన చిరంజీవి తన వంతుగా రూ.కోటి రూపాయల విరాళం ఇచ్చి తన మానవతా దృక్పధాన్ని చాటుకున్నారు . ఇక ఇప్పుడు పోలీసులు చేస్తున్న విశేష సేవలను కొనియాడుతూ వారికి సెల్యూట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లో లాక్ డౌన్ నేపధ్యంలో పోలీసులు సేవలు అందిస్తున్నారు. ప్రజలు గుమికూడకుండా చేస్తూనే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు కాపలా కాస్తున్నారు. కరోనా కట్టడిలో మేము సైతం అంటున్న పోలీసుల పనితీరును పలువురు సినీ ప్రముఖులు కొనియాడటం వారికి కాస్త బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా చిరంజీవి తన వీడియో ద్వారా ఇచ్చిన సందేశం వారిలో మరింత ఉత్సాహం నింపుతుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications