HBD Pawan Kalyan: ఈ రోజుల్లో ఆయన వంటి నాయకుడే కావాలి.. రావాలి
Pawan Kalyan Birthday: నేడు.. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన బర్త్‌డే వేడుకలను ఉత్సాహంగా జరుపుకొంటోన్నారు పార్టీ క్యాడర్, అభిమానులు. అటు రాజకీయ ప్రముఖులు, ఇటు టాలీవుడ్ పెద్దల నుంచి ఆయన బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
ఈ జన్మదిన వేడుకలు పవన్ కల్యాణ్‌కు అత్యంత స్పెషల్‌గా నిలిచిపోనున్నాయి. జీవితాంతం గుర్తుండిపోనున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అధినేతగా, అంతకుమించి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ జరుపుకోనున్న తొలి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇవే కావడమే దీనికి కారణం.

మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారీ మెజారిటీతో ఆయన విజయఢంకా మోగించారు. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వంగా గీతను 70,000లకు పైగా మెజారిటీతో ఓడించారు.
ఆయన సారథ్యంలో జనసేన పార్టీ మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. అన్నింట్లోనూ తిరుగులేని మెజారిటీతో గెలిచింది. నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసింది. ఈ జోష్‌తో తన తొలి పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వస్తుంటుంది కానీ.. ఇది మరీ ప్రత్యేకమైనదని అన్నారు. ఏపీ ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాలసిన నాయకుడు, వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి, ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడని చిరంజీవి అభివర్ణించారు.
కళ్యాణ్ బాబు...
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2024
ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.
ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో,
కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో
పెను మార్పులు తీసుకురావడానికి
వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత… pic.twitter.com/IyknPgi2qB
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ప్రజలు వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారని, గుండెల్లో స్థానం ఇచ్చారని చెప్పారు. ఆ స్థానం సుస్థిరమని పేర్కొన్నారు.
ఈ రోజుల్లో రాష్ట్రానికి పవన్ వంటి నాయకుడు కావాలని, అలాంటి వాళ్లే రావాలని, అద్భుతాలు జరగాలని చెప్పారు. ఆ అద్భుతలను పవన్ కల్యాణ్ మాత్రమే చేయగలడని చిరంజీవి చెప్పారు. ఆ నమ్మకం తనతో పాటు ఏపీ ప్రజలందరికీ ఉందని మెగాస్టార్ వ్యాఖ్యానించారు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications