రెస్కోలో రిస్క్ చేసిన వైసీపీ, చంద్రబాబు అడ్డాలో 115 మందికి షోకాజ్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలోని అధికారులకు సినిమా కనపడింది. కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సహకార సంస్థ (రెస్కో)లో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో భారీ ఎత్తున ఇలాంటి అవినీతి జరగడంతో కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది.

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు మొత్తం బయటకు తీయాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మొదట జిల్లా అధికారి ద్వారా కుప్పంలో ప్రారంభించిన దర్యాప్తు వేగవంతమైంది. జిల్లా సహకార సంఘాల అదనపు రిజిస్టార్ శ్రీ లక్ష్మీని విచారణ అధికారిగా నియమిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుప్పం రెస్కోలో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించి ఇప్పటికే విచారణ మొదలైంది.

Chittoor district authorities issued show cause notices to 115 people at Kuppam Resco

గత వైసీపీ ప్రభుత్వంలో రెస్కోలో అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొంది, ఆ తర్వాత శాశ్వత ఉద్యోగాలుగా నిమితులైన 115 మంది ఉద్యోగులకు పైఅధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులతో ఉద్యోగులకి ఇప్పుడు భయం పట్టుకుందని సమాచారం. అయితే విచారణకు హాజరు కావాలని ఆ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినా వాళ్లు మాత్రం విచారణకు హాజరు కాకపోవడంతో ఉన్నతస్థాయి అధికారులు విచారణ వాయిదా వేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరిన ఈ 115 మంది, మీటరు రీడర్లు గా ఉద్యోగంలో చేరిన 17 మంది, కారుణ్య నియామకాలలో ఉద్యోగాల్లో చేరిన మరో ఆరు మంది రెస్కోలో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిలో చాలా మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలామంది ఉద్యోగులకు అప్పటి వైసీపీ ప్రభుత్వం పదోన్నతులు కూడా కల్పించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Chittoor district authorities issued show cause notices to 115 people at Kuppam Resco

వీరికి శాశ్వత ఉద్యోగాలు కల్పించడానికి కొంతమంది వైసీపీ నాయకులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి రెస్కో చైర్మన్ ఆదేశాలతో ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా, ఎలాంటి అర్హతలు లేకుండానే చాలామంది శాశ్వతం ఉద్యోగాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై కూటమి ప్రభుత్వం విచారణ మొదలు పెట్టింది. సహకార సంస్థ నిబంధనల ప్రకారం రెస్కోలో ఉద్యోగాలు కల్పించాలి.

అయితే ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా, వారి అర్హతలు పరిశీలించకుండానే 115 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారని, ఉద్యోగుల ఎంపికలో మార్గదర్శకాలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి, కొందరు వైసీపీ నాయకులు ఆదేశాల మేరకే ఉద్యోగుల నియామకం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ ఉద్యోగులకి షోకాజ్ నోటీసులు జారీ చేసిన అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఈ దెబ్బతో కుప్పంలో చక్రం తిప్పాలని అనుకున్న కొందరు వైసీపీ నాయకులకి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+