చంద్రబాబు కాన్వాయ్ పై బాంబులు వేస్తాం, కుప్పం రెస్కో మాజీ చైర్మన్ కు సినిమా

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు పైన అనేక విమర్శలు చేసి ఆయనపై ఎగిరెగిరి పడిన వైసీపీ నాయకులు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గంలో ఇంతకాలం పాటుపడి, కుప్పంలో నియోజక వర్గంలో వైసీపీకి తిరుగులేదని, ఇక్కడ నేనే మకుటం లేని మహారాజు అంటూ విర్రవీగిన కుప్పం రెస్కో మాజీ చైర్మన్ కు చుక్కలు చూపించారు.

Chittoor district police officials arrested the former chairman of Kuppam Resco

కుప్పం రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ అలియాస్ సెంథిల్ ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో సెంథిల్ కుమార్ వైసీపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడిగా సెంథిల్ కుమార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో అడుగుపెట్టనివ్వవమని సెంథిల్ కుమార్ బహిరంగంగానే శపథం చేశాడు.

చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తే ఆయన క్వానాయ్ పై అవసరమైతే బాంబులు వేస్తానని అప్పట్లో కుప్పం రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో కుప్పం టీడీపీ నాయకులు సెంథిల్ కుమార్ మీద ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం పట్టించుకోకుండా సెంథిల్ కుమార్ నువదిలేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెస్కో చైర్మన్ పదవి సెంథిల్ కుమార్ రాజీనామా చేశారు.

చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో సెంథిల్ కుమార్ కుప్పం నుండి పరారైనాడు. అప్పటినుండి సెంథిల్ కుమార్ కోసం కుప్పం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. తమిళనాడులోని రహస్య ప్రాంతంలో సెంథిల్ కుమార్ తలదాచుకున్నాడు అని కుప్పం పోలీసులకు సమాచారం అందింది. కుప్పం పోలీసులు తమిళనాడు చేరుకుని మంగళవారం సెంథిల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలోని రెస్కోలో జరిగిన అవినీతిపై విచారణ మొదలైయ్యింది. మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అండ చూసుకొని ఇంతకాలం రెచ్చిపోయిన సెంథిల్ కుమార్ కు కుప్పం పోలీసులు సినిమా చూపించడానికి సిద్దం అయ్యారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత కుప్పంలో ఫస్ట్ వికెట్ పడటంతో మిగిలిన వైసీపీ నాయకులకు తడిచిపోతా ఉందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+