జాక్ పాట్ కొట్టిన చిత్తూరు రైతు, 45 రోజుల్లో రూ. 4 కోట్లు సంపాదన, అప్పులు క్లోజ్ !

చిత్తూరు/కోలారు: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకవైపు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడితే మరోవైపు టమోటా రైతులకు జాక్‌పాట్ తగిలింది. రెండు నెలల్లో ఆంధ్రా, కర్ణాటక రైతులు కోట్లకు పడగలెత్తినట్లు టమాటా మార్కెట్ యార్డుల నుంచి సమాచారం వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని మనదపల్లె, కర్ణాటకలోని కోలార్ మార్కెట్ లో టమాటకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఆ పరిసర ప్రాంతాల రైతులు భారీగా లాభాలు గడిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన మురళి (48) అనే రైతు ఒకటిన్నర నెలలో నాలుగు కోట్లు డబ్బు సంపాదించాడు. రైతు కుమారుడైన మురుళి తొలిసారిగా టమోటాల ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించినట్లు'టైమ్స్ ఆఫ్ ఇండియా'పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మురళి కేవలం 45 రోజుల్లోనే రూ.4 కోట్లకు పై టమాటాలు విక్రయించి డబ్బు సంపాదించాడు.

tomatoform

తాను పండించిన టమోటాలను కర్ణాటకలోని కోలార్‌లోని మార్కెట్‌కు పంపుతుంటానని మురళి చెప్పాడు. కోలారులోని ఏపీఎంసీ యార్డులో మంచి ధర లభిస్తుండడంతో కోలార్‌లో టమాట విక్రయిస్తున్నారు. మరళి స్వగ్రామానికి కోలార్ దాదాపు 130 కి.మీ దూరం ఉంది. మదనపల్లె మార్కెట్, చిత్తూరు జిల్లాలోని పలమనేరు టామాటా మార్కెట్ లో కూడా టమాటాలకు భారీ డిమాండ్ ఉంది. అయితే కోలారు ఏపీఎంసీకి టమాటా తెచ్చి అమ్మేందుకు మురళి చాలా దూరం ప్రయాణిస్తున్నాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియాతో మురళి మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా టమాటా సాగు చేస్తున్నానని, ఈ ఏడాది మాత్రం టామాటాలకు ఇలాంటి డిమాండ్ వచ్చిందని, గతంలో టమాటాలు ఇంత ధరలు పలకలేదని అన్నారు. ఈ సంవత్సరం తాను వేసిన టమాటాలు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మరళి అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని కరకమండలం గ్రామంలో మురళి ఉమ్మడి కుటుంబానికి వారసత్వంగా 12 ఎకరాల భూమి వచ్చింది.

కొన్నేళ్ల క్రితం అదనంగా మురళి మరో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. గతేడాది జులైలో ధరల పతనంతో అతని కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. విత్తనాలు, ఎరువులు, కూలీలు, రవాణా, ఇతర లాజిస్టిక్స్‌పై పెట్టుబడి పెట్టి సుమారు రూ.1.5 కోట్ల అప్పులు చేశాడు. అయితే, ఈసారి మాత్రం మురళిని అదృష్టం వరించింది. ఈ ఏడాది పంట నాణ్యంగా ఉండడంతో ఇప్పటివరకు 45 రోజుల్లో 35 సార్లు టమాటాలు కోసి విక్రయించాడ.

tomatoform

ఇంకా 15 నుంచి 20 రోజుల వరకు పండే అవకాశం ఉందని మురళి తెలిపారు. మురళి కొడుకు ఇంజినీరింగ్‌, ఆమన కూతురు మెడిసిన్ చదువుతున్నారు. అప్పులన్నీ తీర్చినా 45 రోజుల్లో అన్ని ఖర్చులు పోను రూ. 2 కోట్లు ఆదా చేశానని మురళి అంటున్నాడు. టమాటాల్లో వచ్చిన లాభాలతో మురళి ఇప్పుడు భూమి కొనే ఆలోచనలో ఉన్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున వ్యవసాయం చెయ్యాలని నా కోరిక అని మురళి అంటున్నాడు.

టమాటాల్లో వచ్చిన లాబాలతో తమ గ్రామంలో దాదాపు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని మురళి అంటున్నాడు. పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులందరికీ ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న వాడు ఎప్పటికీ పోరాటాన్ని ఆపలేడని, ఎప్పటికైనా నమ్ముకున్న భూమాత రైతులను ఆదుకుంటుందని మురళి అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+