చాకొలెట్ హబ్‌గా ఏపీ- రాష్ట్రానికి తీపికబురు..!!
అమరావతి: పెట్టుబడుల అన్వేషణలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరో తీపి కబురు అందింది. విశాఖపట్నంలో ఇటీవలే నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు అదనంగా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. జగన్ ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పరస్పర అవగాహన ఒప్పందాలు కుదురుతున్నాయి. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి మల్టీనేషన్ కంపెనీలు ముందుకు వస్తోన్నాయి.
విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో సుమారు 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఒప్పందాలను కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. ఆయా ఒప్పందాల వల్ల ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సదస్సుకు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు- ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, గ్రంధి మల్లికార్జున రావు, సజ్జన్ భజాంక, పునీత్ దాల్మియా, అర్జున్ ఒబెరాయ్, నవీన్ జిందాల్, హరి మోహన్ బంగూర్, కియా ఇండియా చీఫ్ కబ్ డోంగ్ లీ పాల్గొన్నారు.
ఇప్పుడు తాజాగా మరో భారీ పెట్టుబడి రాష్ట్రానికి రానుంది. దీని విలువ 1,600 కోట్ల రూపాయలు పైమాటే. మాండలేజ్ ఇండియా (Mondelez India) ఈ పెట్టుబడులు పెట్టబోతోంది. దేశంలో 4,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించుకున్న ఆ సంస్థ- ఓ యూనిట్ ను ఏపీలో నెలకొల్పడానికి జగన్ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మాండలేజ్ ఇండియా- క్యాడ్ బరీ డెయిరీ మిల్క్ (Cadbury Dairy milk) చాకొలేట్ ను తయారు చేస్తుంది.

వచ్చే మూడు సంవత్సరాల వ్యవధిలో భారత్ లోని వేర్వేరు రాష్ట్రాల్లో 4,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగా ఏపీలో 1,600 కోట్ల రూపాయలతో పైగా యూనిట్ ను నెలకొల్పనుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న తన ఉత్పాదక కార్యకలాపాలను మరింత విస్తరించుకోబోతోందీ కంపెనీ. ఫ్యాక్టరీలతో పాటు వాటికి అనుసంధానంగా గోడౌన్లు, లాజిస్టిక్ సెగ్మెంట్ ను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించింది.
గ్రామీణ స్థాయిలో తమ ఉత్పత్తులను చేరవేయడంలో భాగంగా కోల్డ్ చైన్ స్టోరేజీలను పెద్ద ఎత్తున నిర్మించబోతోంది. కంపెనీ బ్రాండ్ ప్రమోషన్స్, అడ్వర్టయిజ్‌మెంట్స్ లల్లోనూ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు మాండలేజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ అయ్యర్ తెలిపారు. ఇప్పటికే ఓరియో (Oreo) కుకీల తయారీ కోసం 1,500 కోట్ల రూపాయలతో మానుఫ్యాక్చరింగ్ యూనిట్లను విస్తరించామని ఆయన పేర్కొన్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications