ఏపీలో హెలికాఫ్టర్ల వాడకంపై రచ్చ-వైసీపీ ఆరోపణలకు లోకేష్ ఘాటు కౌంటర్..!

ఏపీలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష వైసీపీ మధ్య నేతల హెలికాఫ్టర్ల వాడకంపై మాటల యుద్ధం సాగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీగా హెలికాఫ్టర్లను వాడుతున్నారని, ముఖ్యంగా ఏపీ-తెలంగాణ మధ్య వీరి ప్రయాణాలు ఎక్కువయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి ఇవాళ మంత్రి నారా లోకేష్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్ల వాడకం లెక్కల్ని బయటపెట్టారు.

చంద్రబాబు, లోకేష్ హెలికాఫ్టర్ల వాడకంపై ఇవాళ వైసీపీ ఓ ట్వీట్ చేసింది. ఇందులో కరో కరో జల్సా కరో.. మీ తండ్రి కొడుకులు..పని బాగుంది.. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలు వేసుకుని షేర్ ఆటోల మాదిరి ఇష్టానుసారం షికార్లు చేస్తున్నారు. రైతులు, విద్యార్థులు .. ఎవరు ఎలా అల్లాడిపోతున్నా మీ జల్సాలకు మాత్రం లోటు లేదులే.. ఎవడబ్బ సొమ్మని ప్రత్యేక విమానాల్లో 70 సార్లు హైదరాబాద్ వెళ్లారు.. తండ్రీకొడుకులు రాష్ట్రానికి భారమే తప్ప ఎవరికీ పైసా ప్రయోజనం లేదు..

Chopper Misuse Row Heats Up NDA and YSRCP Spar Over Expenses

ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆంధ్రాలో కన్నా హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటూ ఇప్పటికే 122 సార్లు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేశారు.. మీ ముగ్గుర్ని సుఖపెట్టడానికి రాష్ట్ర ప్రజలు కష్టించి పన్నులు కడుతున్నారంటూ వైసీపీ ట్వీట్ చేసింది. దీనిపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. జగన్‌ వాడిన ప్రత్యేక హెలికాప్టర్‌, విమానం ఖర్చు రూ.220 కోట్లు దాటిందన్నారు.

Chopper Misuse Row Heats Up NDA and YSRCP Spar Over Expenses

లీజుకు తెచ్చిన చాపర్‌తో చంద్రబాబు సమయం, ఖర్చు ఆదా చేస్తున్నారని లోకేష్ తెలిపారు. చంద్రబాబు 15 నెలల్లో చేసిన పర్యటనలు జగన్‌ 5 ఏళ్లలోనూ చేయలేదన్నారు. లీజుకు తెచ్చిన చాపర్‌ ఖర్చు ఐదేళ్లకు రూ.100 కోట్లు అవుతుందేమో అన్నారు. జగన్‌ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమం ఖర్చు రూ.7 కోట్లు అయ్యేదన్నారు. చంద్రబాబు పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమం ఖర్చు రూ.25 లక్షలే అన్నారు. జగన్‌ చేసిన అనవసర ఖర్చులు చాలావరకు తగ్గించామని మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+