సీఐడీ విచారణలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్- కీలక విషయాలు రికార్డ్
అమరావతి: అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు దర్యాప్తు ఊపందుకుంది. సీఐడీ అధికారులు తమ దూకుడు పెంచారు. ఇటీవలే ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేసిన అధికారులు- తాజాగా ఆయన కోడలు, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజా కిరణ్‌ను విచారించారు. 10 గంటల పాటు విచారణ కొనసాగింది.
ఛిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది మార్గదర్శి సంస్థ యాజమాన్యం. అవి నిజమని తేలడంతో సీఐడీ అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఛిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా రామోజీ రావుకు చెందిన 793,50,72,460 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేశారు.

ఇవ్వాళ- శైలజా కిరణ్‌ను విచారించారు. 10 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. సీఐడీ ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, డీఎస్పీ రవికుమార్, మహిళా ఏసీపీతో కూడిన 27 మంది సభ్యులు గల అధికారుల బృందం ఈ విచారణలో పాల్గొంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రామోజీ రావు నివాసంలో విచారణ సాగింది. ఈ వ్యవహారం మొత్తాన్నీ వీడియో కెమెరాలు, ఫుట్ కెమెరాలతో రికార్డ్ చేశారు.
మార్గదర్శి సంస్థల ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీశారు. శైలజా కిరణ్ అందజేసిన డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలించారు. మార్గదర్శి ఖాతాదారుల నగదు దారి మళ్లింపును కేంద్ర బిందువుగా చేసుకుని పలు ప్రశ్నలను సంధించారు. ఛిట్ ఫండ్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు సీఐడీ అధికారులు ఆధారాలతో సహా దానికి సంబంధించిన వివరాలను శైలజా కిరణ్ ముందుంచారు.

మార్గదర్శిలో డిపాజిటర్ల నగదును ఇతరత్రా సంస్థలకు మళ్లించిన వ్యవహారంలో సంస్థ ఛైర్మన్ రామోజీ రావును ఏ1, శైలజా కిరణ్‌ను ఏ2గా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు ఫోర్‌మెన్లు, ఆడిటర్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రామోజీ రావును ఇదివరకే ప్రశ్నించారు. తాజాగా శైలజా కిరణ్‌పై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.

విచారణ కొనసాగుతున్న దశలో శైలజా కిరణ్ తనకు అనారోగ్య సమస్య ఉందని తెలియజేయడంతో డాక్టర్లతో పరీక్షలు చేయించారు. అనంతరం యధాతథంగా ఈ ప్రక్రియను పునఃప్రారంభించారు. శైలజా కిరణ్ కొంత మేరకు సమాధానాలు ఇచ్చారని డీఎస్పీ రవి కుమార్ తెలిపారు. మరో విడత విచారించాల్సి ఉందని స్పష్టం చేశారు. త్వరలో మళ్లీ నోటీసులు జారీ చేస్తామని రవికుమార్ వివరించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications