వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుని ఘటన: దొంగిలించిన ఫోన్లతో విధ్వంసం సృష్టించారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

కాకినాడ: కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించిన సభ సందర్భంగా జరిగిన తుని విధ్వంస ఘటనలో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు కీలక పురోగతి సాధించారు. వీడియో ఫుటేజి ఆధారంగా ఫొటోలతో నిందితులను గుర్తించారు. దొంగలించిన ఫోన్ల సాయంతో దుండగులు విధ్వంసం సృష్టించారా అనే కోణంలో కూడా సిఐడి అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.

'తుని ఘటనలో జగన్ హస్తం': ఎప్పుడేం జరిగింది (పిక్చర్స్)'తుని ఘటనలో జగన్ హస్తం': ఎప్పుడేం జరిగింది (పిక్చర్స్)

సీఐడీ పిలుపుతో విధ్వంసానికి పాల్పడిన వ్యక్తుల సమాచారాన్ని స్థానిక ప్రజలు పోలీసులకు అందించారు. జనవరి 30, 31, ఫిబ్రవరి 1న తుని ప్రాంతంలో 50 సెల్‌టవర్ల నుంచి వెళ్లిన కాల్‌డేటాను సేకరించి సిఐడి విశ్లేషించింది. సీఐడీ జాబితాను స్థానిక పోలీసులు ధృవీకరించారు.

 CID intensifies probe in Tuni incident

పోలీసులు ఇప్పటికే పలువురిని విచారించారు. రాష్ట్రవ్యాప్తంగా రౌడీషీటర్ల సమాచారాన్ని సేకరించి తుని ఘటనలో పాల్గొన్న నిందితులను గుర్తించే ప్రయత్నం చేశారు. విధ్వంసంలో పాల్గొన్నవారి వెనక ఉన్న వ్యక్తులు, నేతల సమాచారాన్నిపోలీసులు సేకరిస్తున్నారు.

'కాపు'లపై మాట తప్పారు, 'తుని' ఘటనపై బాబుని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్'కాపు'లపై మాట తప్పారు, 'తుని' ఘటనపై బాబుని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్

కుట్ర, ఉద్దేశపూర్వకంగా లేదా ఉద్రేకపూరితంగా జరిగిందా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. సీఐడీ శాస్త్రీయంగా అన్ని రకాల ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలో నిందితుల అరెస్టుల పర్వం ప్రారంభించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 12 మంది నిందితులను సిఐడి అధికారులు గుర్తించినట్లు సమాచారం.

'కాపు'లపై మాట తప్పారు, 'తుని' ఘటనపై బాబుని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్'కాపు'లపై మాట తప్పారు, 'తుని' ఘటనపై బాబుని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్

రాజమండ్రి తదితర ప్రాంతాల్లోని రౌడీషీటర్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు. పూర్తి శాస్త్రీయ పద్ధతిలో విచారణ జరుపుతున్నట్లు సిఐడి అధికారులు చెబుతున్నారు. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును దుండగులు కాల్చి వేసిన విషయం తెలిసిందే.

English summary
Andhra Pradesh CID officers intensified their probe in Tuni voilence, occured during Mudragada Padmanabham's Kapu sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X