వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐ ఎన్వీ రమణకు అరుదైన అవకాశం - చరిత్రలో నిలిచిపోయేలా..!!

|
Google Oneindia TeluguNews

తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా ఉన్న ఎన్వీ రమణ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ నెల 25న సీజేఐ ఎన్వీ రమణ తన బాధ్యతల్లో భాగంగా నిర్వర్తించే ఒక అరుదైన కార్యక్రమంతో ఆ ఘనత దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా నిలవనున్నారు. తాజాగా జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ రేపు (24న) పదవీ విరమణ చేయనున్నారు.

సీజేఐ ఎన్వీ రమణకు అరుదైన ఛాన్స్

సీజేఐ ఎన్వీ రమణకు అరుదైన ఛాన్స్

ఈ నెల 25న భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందు కోసం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుండటంతో..25న సమావేశాలు రోజు ఉదయం 11 గంటలకు సమావేశం అవుతున్నాయి. అయితే, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కారణంగా 25వ తేదీన ఉభయ సభల సమావేశాలను ఆ రోజు మధ్నాహ్నం 2 గంటలకు ప్రారంభించనున్నారు. 25వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిగా ముర్ముతో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

తొలి తెలుగు వ్యక్తిగా మరో రికార్డు

తొలి తెలుగు వ్యక్తిగా మరో రికార్డు

భారత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా సీజేఐ హోదాలో ఎన్వీ రమణ ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయే అవకాశం దక్కించుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ అత్యున్నత రాజ్యంగ పదవి అధిరోహించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ -తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా ఆయనను సత్కరించాయి.

ఇక ,సీజేఐగా ఆయన కోర్టుల్లో ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీ.. కొత్త కోర్టుల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతితో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఇప్పుడు ఎన్వీ రమణ కు దక్కింది.

ముర్ము రాష్ట్రపతి అయ్యే వేళ..

ముర్ము రాష్ట్రపతి అయ్యే వేళ..

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు కోవింద్ అనంతర రాష్ట్రపతితో ముర్ముతో సీజేఐ ఎన్వీ రమణ ప్రమాణం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి.. ప్రధాని.. కేంద్ర మంత్రులు..పలు రాష్ట్రాల సీఎంలు.. పలువురు న్యాయమూర్తులు హాజరు కానున్నారు.

ముర్ముకు ఏపీలో వైసీపీ - టీడీపీ మద్దతు ఇచ్చారు. ఏపీలోని అన్ని ఓట్లు ముర్ముకు మద్దతుగా పోలయ్యాయి. సీఎం జగన్..టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతుగా నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ పరిణామాల్లో భాగంగా సిన్హాకు మద్దతు ప్రకటించారు. కానీ, ఇప్పుడు భారత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న వేళ.. సీజేఐ ఎన్వీ రమణ పేరు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.

English summary
Murmu will be sworn in as India's 15th President on July 25, CJI NV Ramana will administer her the oath of office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X