అలరించిన అమెరికా నృత్యకారిణి ప్రదర్శన(పిక్చర్స్)
హైదరాబాద్: అమెరికాలోని మాడిసన్‌కు చెందిన నృత్య కళాకారిణి మీనాక్షి గణేశన్ శుక్రవారం ఉదయం రవీంద్రభారతిలో భరతనాట్యాన్ని తన శిష్యులతో కలిసి హృద్యంగా ప్రదర్శించారు. తొలుత ‘ప్రభు ప్రాణనాథం..' శివాష్టకాన్ని అద్భుత హస్త పాద విన్యాసాలతో నటరాజస్వామిని అభినయంలో ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ అంశంలో శిష్యురాళ్లు లక్ష్మీ వేమూరి, ఇలియానా సహ నర్తకులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ, ఈనెల 18 నుంచి ఇండియా టూర్ పేరుతో ముంబై, చెన్నైలలో నృత్యాన్ని ప్రదర్శించినట్లు చెప్పారు. పద్మినీ రాధాకృష్ణన్ గానానికి రవి అనంతరామన్ వయొలిన్ సమకూర్చారు.

నృత్య ప్రదర్శన
అమెరికాలోని మాడిసన్‌కు చెందిన నృత్య కళాకారిణి మీనాక్షి గణేశన్ శుక్రవారం ఉదయం రవీంద్రభారతిలో భరతనాట్యాన్ని తన శిష్యులతో కలిసి హృద్యంగా ప్రదర్శించారు.

నృత్య ప్రదర్శన
తొలుత ‘ప్రభు ప్రాణనాథం..' శివాష్టకాన్ని అద్భుత హస్త పాద విన్యాసాలతో నటరాజస్వామిని అభినయంలో ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నృత్య ప్రదర్శన
ఈ అంశంలో శిష్యురాళ్లు లక్ష్మీ వేమూరి, ఇలియానా సహ నర్తకులుగా పాల్గొన్నారు.

నృత్య ప్రదర్శన
ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ, ఈనెల 18 నుంచి ఇండియా టూర్ పేరుతో ముంబై, చెన్నైలలో నృత్యాన్ని ప్రదర్శించినట్లు చెప్పారు. పద్మినీ రాధాకృష్ణన్ గానానికి రవి అనంతరామన్ వయొలిన్ సమకూర్చారు.












Click it and Unblock the Notifications