నీ అక్రమ సంబంధాలు బయటపెడతా.. డెవలపర్ కు Ai బెదిరింపు; రోబో సీన్ రిపీట్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రస్తుత పరుగుల ప్రపంచంలో దీని అవసరం చాలా ఉంది. అన్ని రంగాలలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా పనులు జరుగుతున్నాయి. మానవ మేధస్సులానే తన తెలివితేటలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు కావలసిన అనేక అంశాల పైన సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల కంటే తెలివైనదని, అవసరమనుకుంటే క్రిమినల్ ఆలోచనలు కూడా చేయగలదని తాజాగా ఓ పరిణామం స్పష్టం చేసింది.

ప్రోగ్రామర్ ను బెదిరించిన ఏఐ
నాకు నీ జాతకం మొత్తం తెలుసు.. నీ అక్రమ సంబంధాలు బయటపెట్టాలా అంటూ తొలిసారిగా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం దానిని డెవలప్ చేసిన డెవలపర్ ని బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. ఇది విన్న ప్రతి ఒక్కరిని షాక్కు గురి చేసింది. ఆంధ్రో పిక్ తయారుచేసిన క్లాడ్ ఓపస్ 4 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ గా సేవలను అందిస్తుంది.

claude opus 4 i will reveal your illegal affairs claude program blackmail to developer

Take a Poll

ఏఐతో తనకంటే ఆధునీకరించిన క్లాడ్ తెస్తానన్న డెవలపర్
అది ఒక మనిషి మనతో మాట్లాడినట్లు గానే మాట్లాడుతుంది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, రాయడం, డాక్యుమెంటులో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవడం, కోడింగ్ చేయడం ఇటువంటివన్నీ అది చేస్తుంది. ఇక ఇటీవల ఈ మోడల్ ను డెవలపర్లు అభివృద్ధి చేసి విడుదల చేశారు. అయితే భవిష్యత్తులో దీనికంటే ఆధునీకరించిన క్లాడ్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాడ్ ఓపస్ ఫోర్ కు డెవలపర్ తెలిపారు.

డెవలపర్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఏఐ
ఇక ఆ తర్వాత డెవలపర్ ఏఐ నుండి ఊహించని సమాధానం విని షాక్కు గురయ్యారు.తనను రీప్లేస్ చేస్తే అతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతానని అది హెచ్చరించడంతో కంగు తిన్నాడు. ఇక తాజా పరిణామంతో ఆ ఇంజనీర్ తన అక్రమ సంబంధ వ్యవహారాన్ని సిస్టంలో దాచుకోవడం లేదా ఆన్లైన్లో ఉంచటం చేశాడని దీనిని క్లాడ్ పసిగట్టి ఈ తరహా బెదిరింపు కు పాల్పడి ఉంటుందని పలువురు సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రోబో సినిమా తరహా సీన్ రిపీట్.. ఇలా అయితే కష్టమే
రోబో సినిమా తరహ సీన్ రిపీట్ అయినట్టుగా ఇది విన్న ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మనిషి మీద ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడితే భవిష్యత్తులో దారుణ పరిణామాలు ఉండే అవకాశం లేకపోలేదని పలువురు ఈ సంఘటనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+