చంద్రబాబు కీలక పిలుపు - ఇక నుంచి...!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు చేసిన దాని కంటే రా నున్న కాలంలో రెట్టింపు పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజా సేవ చేయాలనేదే తన లక్ష్యమని వివరించారు. తన జీవితం మొత్తం అలుపెరగని పోరాటం చేసానని చెప్పుకొచ్చారు. 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ ఒన్ స్థానంలో నిలబెడతానని చంద్రబాబు వెల్లడించారు.
నాది బాధ్యత
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్చ్ దివస్ కార్యక్రమంలో భాగంగా తణుకులో ప్రజలతో ముఖా ముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఎన్నో పదవులు చూసానని చెప్పారు. నాలుగో సారి ముఖ్యమంత్రిని అయ్యానని.. ప్రతిపక్ష నేతగానూ పని చేసానని గుర్తు చేసారు. తన జీవితం మొత్తం ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే అలుపెరగని పోరాటం చేసానని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఎలా పని చేసానో.. అంత కంటే రెట్టింపు పనితో రాష్ట్రం కోసం శ్రమిస్తానని చెప్పారు. రానున్న అయిదేళ్లు కాలంలో మార్పు తీసుకొస్తానన్నారు. ఒకే ప్రభుత్వం కొనసాగేలా ప్రజలు మద్దతు ఇవ్వాలని సూచించారు.
నష్టం జరిగింది
2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని చంద్రబాబు వివరించారు. స్థానికుల ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారినికి హామీ ఇచ్చారు. గతం లో ఏ సీఎం అయినా తన లాగా వచ్చారా.. ఎవరికైనా మైక్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎవరైనా వచ్చినా పరదాలు కట్టుకుని వచ్చారు.. విమానంలో అలా తిరిగి వెళ్ళిపోయేవారని ఎద్దేవా చేసారు. ఇది ప్రజా ప్రభుత్వం.. సంక్షేమం, అభివృద్ధి రెండు చేయాలనేదే తన అభిమతంగా పేర్కొన్నారు. 2004లో టీడీపీని గెలిపించి ఉంటే ఏపీ ఎక్కడికో వెళ్ళి ఉండేదని చెప్పుకొచ్చారు. 2019లో తనను గెలిపించి ఉంటే, విభజన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదిని చెప్పారు. దానిలో తన తప్పు ఉందని అంగీకరించారు.

కలిసి రావాలి
గుజరాత్‌లో స్థిరమైన ప్రభుత్వం వలన అభివృద్ధి సాధ్యమైందని వివరించారు. స్థిరమైన ప్రభు ఉంటే అభివృద్ధి స్థిరంగా సాగుతుందని కొచ్చారు. ఏపీలో ఇప్పుడు ఉన్నది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. అధికారం ఇస్తే ఏపీని అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు. వేరే వాళ్లు వస్తే ఏదో చేస్తారని ఓట్లేశారన్నారు. ఐదేళ్లలో విపరీతంగా అప్పులు చేసి వెళ్లారని సీఎం చంద్రబాబు వివ చారు. స్వర్ణాంధ్ర కోసం ప్రతీ ఒక్కరూ కంకణం కట్టుకోవాలని.. స్వర్ణాంధ్ర కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. చరిత్రలో తొలి సారిగా మధ్య తరగతి ప్రజలకు భీమా కల్పిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications