ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ - పీఆర్సీ , డీఏల పై కీలక నిర్ణయాలు.. నేడే ప్రకటన..!?
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ ఫలించింది. ఉద్యోగుల పీఆర్సీ సహా పెండింగ్ బకాయిల పైన ప్రభుత్వం సానుకూల ప్రకటనకు సిద్దం అవుతోంది. ఉద్యోగ సంఘాలు తమకు రావాల్సిన ఆర్దిక బకాయిల చెల్లింపు కోసం పోరుబాట పట్టారు. కొన్ని సంఘాలు దశల వారీ ఆందోళన చేస్తున్నాయి. దీంతో, వారితో చర్చల కు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ రోజు సంఘాల నేతలతో జరిగే చర్చల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పేందుకు సిద్దమైంది. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (శనివారం) జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 11 ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతున్నారు. వారు ప్రస్తావిస్తున్న అంశాలపై సమగ్రంగా చర్చించటం తో పాటుగా ప్రభుత్వంలో ఆర్దిక సమస్యలను వివరించనున్నారు. ఇదే సమయంలో ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న 12వ వేతన సంఘానికి(పీఆర్సీ) కమిషనర్‌ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే విధంగా, 2 డీఏలను చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్ రావచ్చని తెలుస్తోంది. అదేవిధంగా హెల్త్‌కార్డుల సమస్యకు కూడా పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే పీఆర్సీ కమిషన్ వేశారు. అప్పట్లో కమిషనర్‌గా మన్మోహన్ సింగ్ ను నియమించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త అధికారితో కమిషన్ వేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు నిర్ణయాల పై ఉద్యోగుల్లో ఉత్కంఠ
పీఆర్సీ కమిషనర్ తో పాటుగా డీఏల పైన సీఎం ప్రకటన చేస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ఆశతో ఉన్నారు. ప్రభుత్వం కమిషనర్‌ను నియమించేందుకు ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. ఇక హెల్త్ కార్డుల అంశం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన వేసిన కమిటీ పలుమార్లు సమావేశమైంది. కాగా, తాజాగా సీఎం చంద్రబాబును కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రిని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం ఈ సందర్భంగా వారికి చెప్పారు. పరిష్కారంపై చర్చిస్తున్నా.. ఎందుకు తొందర పడుతున్నారని చంద్రబాబు ఏపీ జేఏసీ నేతలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు న్యాయంగా చేయాల్సిన వాటిని ఒక్కొక్కటిగా చేస్తున్నామని చెప్పినట్టు సమాచారం. దీంతో.. ఈ రోజు చంద్రబాబు తీసుకునే నిర్ణయాల పైన ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications