46 లక్షల రూపాయల జాబ్ వదిలేసి.. ఆర్మీ యూనిఫామ్‌ కోసం కుర్రాడి పోరాటం!

లక్షల్లో జీతాలు, విదేశీ పర్యటనలు, సాఫ్ట్‌వేర్ కొలువులో హాయిగా గడిపేసే అవకాశాలు.. ఇవన్నీ ఒకవైపు! కానీ మాతృభూమి సేవలో దొరికే తృప్తి, ఆర్మీ యూనిఫామ్‌లో ఉన్న గాంభీర్యం ముందర ఆ అంకెలేవీ ఆకర్షించలేకపోయాయి. టెక్ దిగ్గజం అమెజాన్‌లో ఏకంగా రూ. 46 లక్షల వార్షిక ప్యాకేజీని సైతం చిరునవ్వుతో వదిలేసి, దేశ రక్షణ కోసం ఆర్మీ అధికారిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమయ్యాడు ఓ కుర్రాడు. ఆయనే లక్నోకి చెందిన 27 ఏళ్ల శరదేందు తివారీ. శనివారం గయాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి అధికారికంగా సైనిక అధికారిగా బయటకు వస్తూ వార్తల్లో నిలిచారు.

శరదేందు స్వస్థలం సుల్తాన్‌పూర్ జిల్లాలోని పిపర్‌గావ్ కాగా, ప్రస్తుతం కుటుంబంతో కలిసి లక్నోలోని నీల్‌మథాలో నివసిస్తున్నారు. ఆయన తండ్రి రాజ్‌కుమార్ తివారీ ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో ఆనర్స్‌ కెప్టెన్‌గా ఏకంగా 36 ఏళ్ల పాటు దేశానికి సేవలందించి విరమణ పొందారు. చిన్నతనం నుంచే నాన్న యూనిఫాం, ఆర్మీ లైఫ్‌స్టైల్ చూస్తూ పెరిగిన శరదేందుకు సైన్యంలో చేరాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. చండీమందిర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన, చండీగఢ్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఐటీ విభాగంలో బీఈ, కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్ పూర్తి చేశారు.

Amazon Techie Quits Rs 46 Lakh Package to Join Indian Army Shardendu Tiwari Set to Serve Motherland
పరీక్ష లేదు.. ఓన్లీ ఇంటర్వ్యూతోనే ఆర్మీ ఉద్యోగం! లక్షన్నర జీతం
పరీక్ష లేదు.. ఓన్లీ ఇంటర్వ్యూతోనే ఆర్మీ ఉద్యోగం! లక్షన్నర జీతం

ఎనిమిదో ప్రయత్నంలో దక్కిన లక్ష్యం!

చదువు పూర్తి కాగానే అమెజాన్‌లో క్లౌడ్ ఇంజనీర్‌గా భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. ఏరోస్పేస్ దిగ్గజం 'ఎయిర్‌బస్' నుంచి కూడా మంచి అవకాశాలు వచ్చాయి. అయినా సరే తన చిన్ననాటి కలను శరదేందు మర్చిపోలేదు. కార్పొరేట్ కొలువు చేస్తూనే సైన్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. వరుసగా ఏడుసార్లు ఆశించిన ఫలితం రాకపోయినా వెనకడుగు వేయలేదు. పట్టువదలకుండా పోరాడి, చివరికి ఎనిమిదో ప్రయత్నంలో టెక్నికల్ ఎంట్రీ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

మళ్లీ కత్తి నూరుతోన్న టెక్ జెయింట్.. !!
మళ్లీ కత్తి నూరుతోన్న టెక్ జెయింట్.. !!

టెక్నాలజీతో పాటు అడ్వెంచర్ కాంబో!

"ఆర్మీలో నా టెక్నికల్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూనే, దేశం కోసం క్షేత్రస్థాయిలో సేవలు అందించే అవకాశం దక్కింది. సాహసాలతో కూడిన సైనిక జీవితం నాకెంతో ఇష్టం" అని శరదేందు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ట్రైనింగ్ కాలంలో ఆయన చూపించిన నాయకత్వ పటిమ, క్రమశిక్షణకు మెచ్చి ఓటీఏ అకాడమీ అధికారులు ఆయనను 'సీనియర్ అండర్ ఆఫీసర్'గా నియమించారు. ఆటల్లోనూ ముందుండే ఈ యువ అధికారికి బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ ఆడటం అంటే ఎంతో ఇష్టం.

భారీ జీతాలు, విలాసవంతమైన కార్పొరేట్ జీవితం కంటే దేశ సేవలోనే అసలైన సంతోషం ఉందంటూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచిన శరదేందు తివారీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+