చంద్రబాబు అనూహ్య నిర్ణయం - ఢిల్లీ ఎఫెక్ట్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు అప్రమత్తం అయ్యారు. ప్రజల మూడ్.. మద్దతు తో పాటుగా ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో విశ్లేషణ చేస్తున్నారు. దీంతో.. ఏపీ పరిస్థితులను బేరీజు వేస్తున్న చంద్రబాబు.. కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందు కోసం మంత్రులు.. అధికారులతో కీలక భేటీకి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పరంగా అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్ ను ఖరారు చేయనున్నారు. ఈ భేటీ పాలనా పరంగా - రాజకీయంగా కీలకం కానుంది.

కీలక సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (మంగళవారం) కీలక సమావేశం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తోంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ తొమ్మది నెలల కాలంలో సాధించిన పురోగతి పైన సమీక్ష చేయనున్నారు. ఢిల్లీ ఫలితాలతో ప్రజలు ప్రభుత్వాల నుంచి ఏం కోరుకుంటున్నారనే అంశం పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో.. పాలనా పరంగా తీసుకురావాల్సిన మార్పుల పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా కీలక దిశా నిర్దేశానికి సిద్దం అయ్యారు. మంత్రులతో పాటుగా అన్ని శాఖల అధికారులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

CM Chandra Babu key meeting with ministers and secretaries over Governance on 11th

అధికారులకు ఆదేశాలు
11వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కీలక సమావేశం జరగనుంది. రెండు సెషన్లుగా మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుంది. మొదటి సెషన్​లో ఫైళ్ల క్లియరెన్సు, వాట్సప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీలపై చర్చించనున్నారు. రెండో సెషన్​లో కేంద్ర బడ్జెట్, త్వరలో ప్రవేశ పెట్టే ఏపీ బడ్జెట్, శాఖల వారీగా ప్రగతి మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047 పై చర్చ జరగనుంది. సెక్రటరీలు తమ శాఖల​కు సంబంధించి రెండు ప్రెజెంటేషన్స్ పంపాలని సీఎంఓ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి అందుకనుగుణంగా కార్యదర్శులు తమ ప్రెజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలా తయారు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్దేశించారు.

దిశా నిర్దేశం
ఎనిమిది నెలల కాలంలో శాఖల వారీగా సాధించిన పురోగతి.. లక్ష్య సాధనలో ఏ స్థాయిలో ఉన్నార నే అంశం పైన ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. ఆదాయార్జన శాఖల గురించి ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మంత్రులు - అధికారుల మధ్య సమన్వయం పైన వస్తున్న ఫిర్యాదుల పైన సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా సాధారణ ప్రజల నుంచి వస్తున్న గ్రీవెన్స్.. వాటి పరిష్కారం పైన నిర్దిష్ఠ సమయం కేటాయించాలని నిర్ణయించారు. ప్రతీ వారం ప్రజలకు మంత్రులు - అధికారులు అందుబాటులో ఉండేలా సీఎం సూచనలు చేయనున్నారు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అందిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలోనూ అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+