పులివెందుల ఫలితం, మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
పులివెందుల జెడ్పీటీసీ టీడీపీ గెలిచింది. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో పులివెందులతో పాటుగా ఒంటిమిట్ట జెడ్పీటీసీలను టీడీపీ దాదాపుగా ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ ఎన్నిక లు అప్రజాస్వామికంగా జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. మూడు దశాబ్దాల తరువాత పులివెందుల లో ప్రజాస్వామ్య బద్దంగా ఓటింగ్ జరిగిందని టీడీపీ చెబుతోంది. తాజా ఫలితాల పైన చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేసారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్ధి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ గెలుపు పై పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాశామని మంత్రుల కు చంద్రబాబు చెప్పుకొచ్చారు. పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసారన్నారు.

పులివెందులలో గతం కంటే భిన్నంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగిన కారణంగానే ఉప ఎన్నికలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పులివెందుల కౌంటింగ్‌లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని ఓటర్లు స్లిప్ పెట్టారని .. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించాలని సూచించారు. టీడీపీ నేతలు పులివెందుల విజయంపై ప్రజలను చైతన్యం చేసే విధంగా మాట్లాడాలని మార్గ నిర్దేశం చేశారు. పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారని నొక్కిచెప్పారు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ఓటు వేశారనేది ఏపీలో ప్రజలకు తెలియచేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని కూడా చెప్పాలని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications