తీరు బాగోలేదు, ఇక తప్పదు - తేల్చేసిన చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు. వారి తీరు పైన మంత్రివర్గ భేటీలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యతలను ఇంఛార్జ్ మంత్రులు తీసుకోవాలని స్పష్టం చేసారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే ఇక తాను చర్యలు తీసుకోక తప్పదని తేల్చి చెప్పారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా వ్యవహరించినా.. కారణం ఏదైనా వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులేనని నిర్దేశించారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు పైన సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. సమావేశాల సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో వారి తీరు పైన సీరియస్ అయిన సీఎం.. తాజాగా మంత్రివర్గ భేటీలో అధికారిక అజెండా తరువాత మరోసారి ఈ ప్రస్తావన చేసారు. ఈ సమయంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల పైన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపలా బయటా కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఇన్‌చార్జి మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ఇంఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను నియంత్రించాలని సూచించారు. ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పొప్పులను వారికి తెలియజేసి సరిచేసుకోవాలని సూచించాలని చెప్పారు. అయినా, వారు వినకుంటే తన దృష్టిలో పెట్టాలని నిర్దేశించారు. ఇదంతా ఇన్‌ఛార్జి మంత్రులే బాధ్యతగా చేయాలని సీఎం వ్యాఖ్యానించారు. కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానో, మరే కారణంతోనో పార్టీ నిర్దేశించిన గీత దాటారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిణామాలు మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇన్‌చార్జి మంత్రులకు స్పష్టం చేసారు. అసెంబ్లీ జరిగే సమయంలో ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో చెప్పాలని సీఎం సూచించారు. ఇన్‌చార్జి మంత్రులు తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతూ, రాజకీయంగా సమన్వయం చేసుకుంటూ వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని నిర్దేశించారు.
అదే సమయంలో మంత్రులకు కొన్ని కీలక సూచనలు చేసారు. మంత్రులు శాఖాపరంగా ఎలాంటి విమర్శలకూ అవకాశం ఇవ్వకుండా పనిచేయాలని సూచించారు. ఒకవేళ ఏదైనా విమర్శ వచ్చినా వెంటనే స్పందించాలని కోరారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం చూపినా అందరం నష్టపోతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల్లో కనెక్టివిటీ, పారిశ్రామిక ఉత్పత్తి, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన పూర్వోదయ పథకంలో ఏపీని కూడా చేర్చారని, ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, రైల్వేలు, జలమార్గాలు, విద్యుత్తు ఉత్పత్తి పెంపునకు పూర్వోదయ పథకం దోహదపడుతుందని, హార్టీకల్చర్, ఆక్వాకల్చర్ వంటి రంగాలకు ఊపు తెస్తుందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి రానున్న రెండుమూడేళ్లలో సుమారు రూ.65 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం మంత్రులకు వివరించారు. కడపలో జిందాల్ ఉక్కు కర్మాగారాన్ని 2028 కల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి మంత్రులకు తెలిపారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications