పెన్షన్ పెంపు, వారికి ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు: సీఎం సంచలన ప్రకటన

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక ప్రకటనలు చేశారు. సమాజంలో మారుతున్న కుటుంబ వ్యవస్థలు, జనాభా తగ్గుదల వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి 'పాపులేషన్ మేనేజ్‌మెంట్' (Population Management) అనే సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలను కాపాడుకోవడమే లక్ష్యంగా భారీ ప్రోత్సాహకాల గురించి వివరించారు.

భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలే అతిపెద్ద సంపద అని పేర్కొన్న చంద్రబాబు, కేవలం రేషన్, పెన్షన్ కోసం కుటుంబాలు విడిపోకూడదని పిలుపునిచ్చారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్న పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి కుటుంబాలకు అదనపు పెన్షన్, నివసించేందుకు వీలుగా 'ట్రిపుల్ బెడ్ రూమ్' ఇళ్లు, అలాగే నెలకు 60 కేజీల వరకు రేషన్ అందించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని ప్రకటించారు.

CM Chandrababu Announces Triple Bedroom Houses and 60 KG Ration for Large Joint Families in Andhra Pradesh

పురుషులకూ 'మెటర్నిటీ' సెలవులు: CM Chandrababu

రాష్ట్రంలో 58 శాతం మంది దంపతులు ఒక్క బిడ్డకే పరిమితం అవుతున్నారని, ఇది భవిష్యత్తులో జనాభా సమతుల్యతను దెబ్బతీస్తుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే జనాభా నియంత్రణకు బదులు జనాభా నిర్వహణ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మహిళలకే కాకుండా, ఇద్దరు పిల్లలున్న పురుషులకు కూడా రెండు నెలల పాటు 'మెటర్నిటీ సెలవులు' (పితృత్వ సెలవులు) కల్పించనున్నట్లు కీలక ప్రకటన చేశారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే సంప్రదాయ కుటుంబ విలువలను కాపాడుకోవాలని మహిళలకు సూచించారు.

మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం..

సుపరిపాలన ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమానికి మళ్లిస్తామని చెబుతూనే, మహిళా అభివృద్ధి కోసం ప్రత్యేక బ్లూప్రింట్ సిద్ధం చేసినట్లు చంద్రబాబు వివరించారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో 6 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి ఇంటి నుండి ఎంఎస్ఎంఈలు (MSME) రావాలని, అందులో 50 శాతం మహిళలే ఉండాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను 'స్వయం' బ్రాండ్ పేరుతో గ్లోబల్ మార్కెట్లకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ధరల పెంపుపై భరోసా..

అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాల వల్ల పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆ భారం మహిళలపై పడకుండా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటుందని భరోసా ఇచ్చారు. హనుమంతుని శక్తిలా మహిళలకు తమ శక్తి తెలియదని, వారిని అన్ని రంగాల్లో శక్తివంతులుగా తీర్చిదిద్దే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఇంటి స్థలాలు, రుణాలు మరియు సంక్షేమ పథకాలను మహిళల పేరిటే అందిస్తూ వారికి సామాజిక భద్రత కల్పిస్తున్నామని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+