పేద కుటుంబాల లోగిళ్లకు చంద్రబాబు: తక్షణ ఆదేశాలు

Chandrababu: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. పండగ వాతావరణంలో ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఏడాది జులై 1వ తేదీన స్వయంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతోంది. చంద్రబాబే స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి మరీ వాళ్లకు తన చేతులతో పింఛన్ మొత్తాన్ని అందజేస్తోన్నారు.

CM Chandrababu distributed pensions to beneficiaries at Ellamanda

నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ మండలం పరిధిలోని యల్లమందలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు. శారమ్మ అనే పింఛన్ లబ్దిదారు ఇంటికి వెళ్లారు. పింఛన్ నగదును అందజేశారు. ఆమె కుటుంబ ఆర్థిక వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆర్థికంగా కష్టపడుతున్న శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల రుణాన్ని ప్రకటించారు చంద్రబాబు. శారమ్మ కుమార్తెకు నీట్‌లో కోచింగ్ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. నీట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని అభిలాషించారు. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు.

అనంతరం మరో లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికి వెళ్లారు చంద్రబాబు. దీపం పథకం గురించి ఆరా తీశారు. తానే స్వయంగా స్టవ్ వెలిగించి స్వయంగా కాఫీ పెట్టారు. కుటుంబ సభ్యులకు అందించారు. ఏడుకొండలు కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఏడుకొండలును ఆర్థికంగా ఆదుకోవడంలో భాగంగా ఓ దుకాణాన్ని పెట్టుకోవడానికి అప్పటికప్పుడు చేయూతను ప్రకటించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అయిదు లక్షల రూపాయల రుణాన్ని ఇప్పించాలంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి కూడా రుణాన్ని సైతం మంజూరు చేయాలని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం 2,717 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను మొత్తాన్ని ఉండాలని సంకల్పించింది.

ఒకరోజు ముందుగానే అంటే 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 85 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయింది. పెంచిన పింఛన్ మొత్తం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అంటే- ఏప్రిల్, మే, జూన్ నెలలకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన 3,000 రూపాయలకు అదనంగా మరో వెయ్యి రూపాయలను కలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+