చెత్త సేకరణపై సీఎం కీలక ప్రకటన
ఎన్టీఆర్ పిలుపుతో ప్రజా జీవితంలోకి వచ్చిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు తన చివరి శ్వాస వరకూ ప్రజల కోసమే పనిచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కొనియాడారు. నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర (Swarna Andhra Swachh Andhra) కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏడాది క్రితం ఒక ఉద్యమంగా ప్రారంభించామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రతీ నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ పథకం కాదు... అది మన జీవన విధానంగా మారాలి అని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రతీ నెలా మొదటి తారీఖున 'పేదల సేవలో' కార్యక్రమాన్ని చేపట్టి పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్‌గా అమలు చేసి చూపిందన్నారు.

స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయగలుగుతున్నారని, అక్కచెల్లెళ్ల సంక్షేమం కోసం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.33 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందిస్తున్నది కూటమి ప్రభుత్వమే అని వెల్లడించారు.
తినే ఆహారం, తాగే నీరు
పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీరు - ఇవన్నీ కాలుష్య రహితంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. గతంలో చెడు ఆలోచనలతో రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మార్పుకు దారితీసిందన్నారు. తాము కూడా గతంలో జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ వంటి కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి పెట్టామని గుర్తు చేశారు.
ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్
ఇల్లు శుభ్రంగా ఉంచడమే కాకుండా, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. రూ.573 కోట్లతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కింద అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. చెత్త నిర్వహణ కోసం 110 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ల ఏర్పాటుకు రూ.510 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం చెత్తను కూడా ఎత్తలేదు..
గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఈ-ఆటోలు, ట్రై సైకిళ్లు, పుష్ కార్టులు అందించామని, కంపోస్ట్ తయారీ కోసం డస్ట్‌బిన్‌లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం పట్టణాల్లో లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసి వెళ్లడంతో భూమి, భూగర్భ జలాలు, వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిందని సీఎం విమర్శించారు.
ఇప్పుడు ఆ వ్యర్థాలన్నింటిని తొలగిస్తూ శుభ్రమైన వాతావరణాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తొలగించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ 100 శాతం చెత్త సేకరణ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
కాంపోస్ట్ ఎరువు తయారీ..
వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే నాలుగు యూనిట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయని, రాజమండ్రి, విజయవాడల్లో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కాంపోస్ట్ ఎరువు తయారీకి ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ప్లాస్టిక్, ఈ-వేస్ట్ సేకరణ కోసం ఇప్పటికే 130 స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేశామని, 2026 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 660 స్వచ్ఛ రథాలను ప్రవేశపెడతామని వెల్లడించారు.
పాఠశాలల్లో విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లు పెంచేందుకు 'ముస్తాబు' అనే వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, దీని ద్వారా విద్యార్థులకు ఆరోగ్యం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. నగరాల్లో ఆధునిక భారీ స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేసి వినియోగంలోకి తెచ్చామని కూడా వెల్లడించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications