చంద్రబాబు కొత్త ప్రయోగం..! కలెక్టర్ల సదస్సులో ఇలా తొలిసారి..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి కూటమి సర్కార్ ను నడిపించడంలో పలు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఎంతో విన్నూత్నంగా చొరవ తీసుకుని మరీ ప్రయోగాలు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇదే క్రమంలో ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులోనూ చంద్రబాబు మరో కొత్త ప్రయోగం చేశారు. రొటీన్ కు భిన్నంగా చంద్రబాబు చేసిన ఈ ప్రయోగంపై అధికారులు చర్చించుకుంటున్నారు.
అమరావతిలో జరుగుతున్న 5వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు ఈసారి కొత్త విధానం పాటిస్తున్నారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న విజయవంతమైన విధానాల్ని సీఎం చంద్రబాబు.. ఆయా జిల్లాల కలెక్టర్లతోనే ప్రజెంటేషన్ ఇప్పిస్తున్నారు. ఇలా ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో పలు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. రోటీన్ గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చర్చ జరిగినందుకు ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అల్లూరి, పార్వతిపురం మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లను ఆయన అభినందించారు.

ఇందులో విద్యార్థుల్లో ప్రతిభను ప్రొత్సహించేలా రూపొందించిన ప్రాజెక్ట్ నిర్మాణ్ గురించి వివరించిన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, విద్యార్థులు పరిశుభ్రత, హైజినీక్ కండిషన్స్ పాటించేలా రూపొందించిన ముస్తాబు కార్యక్రమాన్ని ప్రజెంట్ చేసిన పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తెస్తూ.. వారిని మైక్రో ఎంటర్ ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేలా రూపొందించిన ప్రాజెక్ట్ మార్పు కార్యక్రమాన్ని ప్రజెంట్ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ, రైతుల్లో సాధికారత, ఆర్థిక లబ్ది, వ్యవసాయంలో ఉత్తమ విధానాల పాటించేలా రూపొందించిన ఛాంపియన్ ఫార్మర్స్ కార్యక్రమాన్ని వివరించిన నెల్లూరు జిల్లా హిమాన్షు శుక్లా ఉన్నారు.

అలాగే విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్నం భోజనంలో అందించేందుకు ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లపై ప్రజెంటేషన్ ఇచ్చిన కడప కలెక్టర్ సీహెచ్ శ్రీధర్, రెవెన్యూ రికార్డుల ట్యాంపర్ చేయకుండా చేపట్టిన డిజిటలైజేషన్ విధానం, ఏఐ వినియోగంపై రూపొందించిన ప్రాజెక్టును ప్రజెంట్ చేసిన అనంతపరం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉన్నారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి ప్రజలకు ఉపయోగపడే మరిన్ని వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో రావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!











Click it and Unblock the Notifications