సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎం జరిగింది?, మ్యాటర్ !!

కుప్పం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారని సమాచారం. అధికారంలో లేని సమయంలో కుప్పంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారని ఆ సమయంలో స్థానికులకు వైసీపీకి ఎవరు సహకరించారు అని టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో వరుస విజయాలతో ఎమ్మెల్యే అవుతూ వచ్చారు.

అదే కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలని వైసీపీ అధినేత, ఆ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ కార్యకర్త భరత్ ను రంగంలోకి దింపారు. చంద్రబాబు నాయుడిని ఓడించాలననే కసితో భరత్ ను ఎమ్మెల్సీ చేశారు. అయితే ఇప్పుడు అదే వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఆ కుప్పం పరిసర ప్రాంతంలోనే కాకుండా ఎవరికి కనపడకుండా మాయం అయ్యాడని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

CM Chandrababu Naidu has focused on his own constituency

ఇలాంటి సమయంలో 2019 నుండి 2024 వరకు కుప్పం నియోజకవర్గంలో ఎన్ని కోట్ల నిధులు విడుదలయ్యాయి, ఎవరెవరు ఏమేం పనులు చేశారు, వైసీపీ నాయకులు ఎవరెవరు వాళ్లకు అనుకూలంగా పనిచేశారు అనే విషయంపై టీడీపీ కార్యకర్తలు ఓ నివేదిక సిద్ధం చేశారని తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి వివరాలు బయటకు లాగుతున్నారని తెలిసింది. తన సొంత నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఓ కన్ను వేశారని తెలిసింది.

కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో పలు శాఖలలో అర్హతలేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని ఇప్పటికే వెలుగు చూసింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు విచారానిరకు ఆదేశాలు జారీ చేశారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారని తెలిసింది.

CM Chandrababu Naidu has focused on his own constituency

ఈ విషయంపై కుప్పం నియోజకవర్గం టీడీపీ నాయకులు ఇప్పటికే పూర్తి నివేదిక చంద్రబాబు నాయుడుకు అందించాలని సమాచారం, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన పోలీసు అధికారులు సైతం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+