దీపావళికి నిరుపేదలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త!
ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణంపైన కృత నిశ్చయంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పనులను ప్రభుత్వం పూర్తి చేసి వారితో గృహ ప్రవేశాలు చేయించాలని ప్లాన్ చేసింది.
ఏపీ ప్రభుత్వ శుభవార్త
విజయదశమి నాటికి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని మొదట భావించినా, ఇప్పుడు దీపావళికి ఏపీలో నిరుపేదలకు సంబంధించిన మూడు లక్షల గృహ ప్రవేశాలు చెయ్యాలని నిర్ణయించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నేరుగా నిరుపేదలకు శుభవార్త చెప్పారు. ఏపీ ప్రభుత్వం నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ గృహ నిర్మాణాలను చేయాలని ప్రోత్సహించి, వాటిని త్వరితగతిన పూర్తిచేసి దీపావళి నాటికి వారితో గృహప్రవేశాలు చేయించాలని నిర్ణయించింది.

దీపావళికి చంద్రబాబు కానుక
దీనికోసం గృహనిర్మాణ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.దీపావళి కానుకగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం పనులు చేయిస్తుంది. సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి లబ్దిదారులకు అప్పగించేలా కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే మార్చికల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
నిరుపేదలకు స్వయంగా శుభవార్త చెప్పిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నిన్న విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శుభవార్త చెప్పారు. ప్రభుత్వ పథకాల కింద నిర్మిస్తున్న గృహాలను త్వరితగతిన పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఈ దీపావళికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మందికి గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటన చేశారు.
ఏపీలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినట్టుగా ఆయన వెల్లడించారు. దేశంలోని పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టు తమ సూపర్ సిక్స్ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
చివరి శ్వాస వరకు పేదల కోసమే పని చేస్తానన్న చంద్రబాబు,
స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు కోటి మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. తన చివరి శ్వాస వరకు పేదల కోసమే పని చేస్తానన్న చంద్రబాబు, వారి సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. పారదర్శకతతో కూడిన సుపరిపాలన అందించే బాధ్యత తీసుకున్నామని పేర్కొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి కావలసిన చర్యలను తీసుకుంటున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications