మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు, నేను మాత్రం వదిలిపెట్టను, చంద్రబాబు
విజయవాడ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించిన వారిని ఎవ్వరినీ తాను వదిలిపెట్టనని, వారికి నిద్రపట్టనివ్వనని సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులను హెచ్చరించారు. కృష్ణా నదిలో 11.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడు వైసీపీ రంగులు ఉన్న మూడు పెద్దపెద్ద బోట్లు విదిలేశారని, ఆ బోట్లు కౌంటర్ ల వెయిట్ లను కాకుండా కాలమ్ ను డీకొట్టి ఉంటే స్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని సీఎం చంద్రబాబు అన్నారు.
కృష్ణా నదిలో వదిలిన బోట్లకు వైసీపీ రంగులు ఎందుకు ఉన్నాయో మాకు మాత్రం అర్థం కావడంలేదని, అయితే ఆ బోట్లను కృష్ణా నదిలిలో వదిలిపెట్టిన వాళ్లను మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం చంద్రబాబు నాయుడు ఆ బోట్లను వదిలిన వారికి వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు ఆ ప్రాంతంలోని ప్రజలకు అందుతున్నాయా, లేదా ? అని సీఎం చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలోని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

కృష్ణా నదిలో ఏ ఉద్దేశంతో పెద్ద పెద్ద పడవలు వదిలేశారు అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, ఈ కుట్రలో భాగం ఉన్న వారిని ఎవరినీ వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులను హెచ్చరించారు. రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి బురద రాజకీయాలు చేస్తున్న వారికి సరైన బుద్ధి చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మనవి చేశారు. కృష్ణా నదిలో బోట్ల వదిలిన కుట్రకోణం కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పడవలను నదిలో వదిలినట్లు నేను మాత్రం వాళ్లను వదలనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications