నేను ఢిల్లీ ఎందుకు వెళ్లానో తెలుసా, సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కొన్ని విషయాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించామని, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని మనవి చేశానని, పోలవరం డయాఫ్రం పనులు త్వరలోనే ప్రారంభం కావాలని ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేశానని చంద్రబాబు అన్నారు.
విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడానని చంద్రబాబు అన్నారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో విశాఖ రైల్వే జోన్ కు భూమిని కేటాయించలేదని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత భూమి కేటాయించామని, శంకుస్థాపన చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఫోర్ లైన్ వెయ్యాలి కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే బీచ్ రోడ్డు విస్తరిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విమానాశ్రయంకు హైవే, బీచ్ రోడ్, మెట్రో పనలు పూర్తి చేస్తామని, ఆ మార్గాల్లో ప్రజలు వెళ్లడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆ పనులు త్వరలోనే చేపడుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని, ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామికి మనవి చేశామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
సాలూరులోనే గిరిజన యూనివర్శిటీని కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ నుండి మచిలీపట్నంకు ఎక్స్ప్రెస్ రోడ్డు వేయ్యాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మనవి చేశామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 వేల కోట్ల రూపాయల రైల్వే పనులు జరుగుతున్నాయని, 2027లో బుల్లెట్ ట్రైన్ పనులు ప్రారంభం కావచ్చని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications