తుపానుతో రూ.4,563 కోట్ల నష్టం- రేపు రైతుల ఖాతాల్లో రూ 6 వేలు జమ: చంద్రబాబు..!!

తీవ్ర తుఫాను రాష్ట్రానికి భారీ నష్టం చేసింది. ఉత్తరాంధ్ర తో పాటుగా కోనసీమలో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నష్టపోయిన వారికి సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ వినతి మేరకు రేపు కేంద్ర బృందం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కాగా.. పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రేపు రూ 6 వేలు జమ కానున్నాయి.

రాష్ట్రంలో అర్నాబ్ తుఫాను కారణంగా జరిగిన నష్టం పైన అధికారులు నివేదిక సిద్దం చేసారు. ఈ తుఫాను కారణంగా ఏపీకి రూ 4, 563 కోట్ల మేర నష్టం జరిగినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. కేబినెట్ భేటీ వేళ శాఖల వారీగా నష్టం అంచనాలను వివరించారు. కాగా.. పీఎం కిసాన్.. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో రేపు (శుక్రవారం) రూ.6,000 జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'పీఎం కిసాన్' పథకం నుంచి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేలు జమ అవుతాయని వివరించారు. ఇందుకోసం రూ.3,120 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆర్నాబ్ తుఫాను లో నష్టపోయిన రైతులతో సహా అందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించారు. సీఎం పూర్తిగా అప్రమత్తం చేయడం వలనే అధికారులు కూడా అలెర్ట్ అయ్యారని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీలో పేర్కొన్నారు.

రెబల్స్ పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఎన్నికల వేళ మంత్రులకు బిగ్ టాస్క్..!!
రెబల్స్ పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఎన్నికల వేళ మంత్రులకు బిగ్ టాస్క్..!!
cm-chandrababu-reveals-4-653-crore-losses-due-to-arnab-cyclone-central-team-to-visit-ap-tomorrow

పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ నిధులు జమ

సంక్షోభం సమయంలో సీఎం చొరవ, అప్రమత్తం చేయడం బాగుందని పవన్ ప్రశంసించారు. కాగా, తాను రేపు తూర్పు గోదావరికి వెళ్లి సమీక్ష నిర్వహిస్తాను అన్న డిప్యూటీ సీఎం తెలిపారు. అయితే. ఈ రోజు, రేపు, ఉభయ గోదావరి, ఇతర జిల్లాలో పర్యటించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో తుఫాను కారణంగా మరిణించిన వారికి సంతాపం తెలిపారు. గతంలో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు వేలాది మంది మరణించారు అన్న సీఎం.. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడే దశకు చేరుకున్నాం అని చెప్పుకొచ్చారు. రాయలసీమ లో ఫ్యాక్షన్, కోస్తాకు తుపాన్ లు ఎక్కువగా వస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ను నిర్మూలించి అక్కడ ఉద్యాన పంటలు పండిస్తున్నామన్నారు. కోస్తా లో కూడా తుపాన్ లు వస్తున్నా ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రాణ నష్టాన్ని ఇంకా తగ్గించాలని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+