ఏపీకి గూగుల్ తో పాటు టాప్ కంపెనీలు.. ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా అనేక కంపెనీలకు ప్రోత్సాహకాలను అందిస్తూ స్వాగతిస్తోంది. ఈ క్రమంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ రానుందని ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వచ్చేనెలలో గూగుల్ విశాఖపట్నంలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది అని ఆయన పేర్కొన్నారు.

పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు
త్వరలో టిసిఎస్ సైతం విశాఖపట్నంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని పేర్కొన్న ఆయన రాయలసీమలో కడప ఉక్కు కర్మాగారం తో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు లో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు.

CM Chandrababu said good news to ap people google tcs top companies to visakha next month

Take a Poll

పోర్టులు, విమానాశ్రయాల మధ్య మెరుగైన రోడ్డు నెట్వర్క్ అభివృద్ధికి సీఎం ఆదేశం
ఇక విశాఖపట్నం జిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ త్వరలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక లాజిస్టిక్ కార్పొరేషన్ ద్వారా పోర్టులు, విమానాశ్రయాల మధ్య మెరుగైన రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి చేయాలని, తద్వారా పరిశ్రమలకు యూజ్ ఫుల్ గా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, నౌకల తయారీ కేంద్రం, హార్బర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి మంచి పెట్టుబడులు
ఇక రాష్ట్రంలో జరుగుతున్న భోగాపురం వంటి కొత్త విమానాశ్రయాల నిర్మాణం ఆయా ప్రాంతాలను ఆర్థిక కేంద్రంగా మారుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మంచి పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్న ఆయన 14 రంగాలలో 10.6 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చామన్నారు.

మొత్తం 122 ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్
మొత్తం 122 ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధి సంస్థ ద్వారా ఐదు లక్షల 83 వేల మూడు కోట్ల పెట్టుబడులు, పరిశ్రమల శాఖ ద్వారా నాలుగు లక్షల అరవై రెండు వేల 453 కోట్ల పెట్టుబడులు ఆశిస్తున్నామన్నారు. ఈ పెట్టుబడులను సక్రమంగా పర్యవేక్షించాలని కూడా సూచించారు. ప్రతి 15 రోజులకు ఈ పెట్టుబడులకు ఎదురయ్యే సమస్యలను సమీక్షించి, ప్రతి మంగళవారం ఇండస్ట్రీ డే నిర్వహించి పరిశ్రమల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+