మా అంచనాలు నిజమయ్యాయి- సీఎం చంద్రబాబు..!!

తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీవ్రత క్రమేణా తగ్గుతోందిని.. రేపటి వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసాయి. కాగా. .సీఎం చంద్రబాబు తుఫాను సహాయక చర్యల గురించి వివరించారు. అధికారులకు కీలక దిశా నిర్దేశం చేసారు. వరుసగా వచ్చిన రెండు తుఫాన్ల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని వెల్లడించారు.

తుఫాను సహాయక చర్యల పై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు మీనమేషాలు లెక్కించకుండా సహాయక చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యతగా చెప్పారు. వేలాది చెట్లు కూలిపోయినప్పటికీ వర్షంలోనే వాటిని తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

మున్సిపల్ ఫలితాల పై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్, ఇక నుంచి..!!
మున్సిపల్ ఫలితాల పై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్, ఇక నుంచి..!!
CM Chandrababu Says Entire Administration Mobilised to Tackle Arnab Murusu Cyclones

విద్యుత్ పునరుద్ధరణ కోసం పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకున్నామని చంద్రబాబు వివరించారు. తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడి ఏపీలో పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బందిని పంపాలని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించామని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడగా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఆర్నబ్ తుఫాన్ కారణంగా 3.52 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. మురసు తుఫాన్ నష్టంపై కూడా ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చంద్రబాబు వివరించారు.

వచ్చే ఆరు గంటలు కీలకం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
వచ్చే ఆరు గంటలు కీలకం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

17 జిల్లాల్లోని 19,265 రేషన్ షాపుల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన 5 వేల మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించామని, గత వారం రోజుల్లో 1,029 మంది గర్భిణులకు కాన్పులు జరిగాయని వెల్లడించారు. రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నామని, అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+