జగన్ ప్రభుత్వంలో తిరుమల లడ్డులో జంతువుల నూనె వాడారు: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

జగన్ హయాంలో తిరుమల ప్రసాదాలను అపవిత్రం చేశారు
వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను కూడా అపవిత్రం చేశారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమలలో నాసిరకమైన సరుకులను వాడడమే కాకుండా నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ ను వాడారని తెలిసిందని, ఆ విషయం తెలిసి తను ఎంతో ఆందోళన చెందానని చంద్రబాబు వెల్లడించారు.

CM Chandrababu sensation Animal fat was used in Tirumala laddu during Jagan regime

వైయస్ జగన్ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గపు పాలన చేసింది
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డు ప్రసాదం కోసం వాడుతున్నామని చంద్రబాబు తెలిపారు. వైయస్ జగన్ ప్రభుత్వం తిరుమల లో దుర్మార్గంగా వ్యవహరించిందని పేర్కొన్న చంద్రబాబు, భక్తులకు నాసిరకం లడ్డూలు ఇచ్చారని, నాణ్యతలేని అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారని ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు.

తిరుమలలో అన్న ప్రసాదం నాణ్యత మరింత పెంచుతాం
తిరుమలలో అన్న ప్రసాదం నాణ్యతను కూడా మరింత పెంచుతామని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన నాటి నుండి తిరుమల ఈవోను మార్చి తిరుమలలో ప్రక్షాళన మొదలు పెట్టారు. ఈవోగా జే శ్యామల రావును నియమించగా ఆయన తిరుమల పవిత్రతను కాపాడేలా, తిరుమలలో అవినీతిని అరికట్టేలా పలు నిర్ణయాలు తీసుకుంటూ, తరచూ తనిఖీలు చేస్తూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.

తిరుమల ఆలయ ప్రసాదాలపై చంద్రబాబు వ్యాఖ్యలతో చర్చ
దేశ విదేశాల నుండి ఎంతోమంది తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రసాదాలను గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని చేసిన వ్యాఖ్యల పైన ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతుంది. దీనిపైన వైసిపి ఎలా స్పందిస్తుందో ముందు ముందు తెలియనుంది.

వరద సాయంగా ఒక నెల జీతం ఇద్దామన్న చంద్రబాబు
ఇదిలా ఉంటే వరదల నేపథ్యంలో 350 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కి వచ్చిందని ఇది ఒక చరిత్ర అని చంద్రబాబు పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఒప్పుకుంటే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలమందరం ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇద్దామని చంద్రబాబు వారిని కోరారు వరద బాధితుల సహాయార్థం ప్రపంచమంతా స్పందించిందని మనం కూడా స్పందిస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+