కొత్త ఏడాదిలో చంద్రబాబు తొలి సంతకం: వారికి బిగ్ రిలీఫ్
CM Chandrababu Naidu: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. గుడ్ న్యూస్ ఇచ్చింది.
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై చంద్రబాబు సంతకం చేశారు. ఈ కొత్త ఏడాదిలో ఆయన సంతకం చేసిన మొట్ట మొదటి ఫైల్ ఇదే కావడం, పైగా అది పేదల ఆరోగ్యానికి సంబంధించింది ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,600 మంది నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ కింద 24 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రూపొందించిన ప్రతిపాదనలు అవి. టీడీపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఆరు నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వేలాదిమంది లబ్ది పొందగలిగారని ప్రభుత్వం తెలిపింది.
ఈ 1,600 మందితో కలిపి కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 9,123 మంది పేదలకు సీఎంఆర్‌ఎఫ్ కింద 124.16 కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయం అందినట్టయింది. ఈ ఏడాది చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సంతకం పెట్టడంతో- తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎంతగానో కట్టుబడి ఉందనే విషయాన్ని మరోసారి రుజువైందని అధికార తెలుగుదేశం పార్టీ తెలిపింది.
జనవరి 1వ తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్న సమయంలోనూ చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు చెప్పారు. దాన్ని చేతల్లో చూపించారు.












Click it and Unblock the Notifications