తుఫాన్ ప్రభావిత జిల్లాలో చంద్రబాబు - కీలక నిర్ణయాలు..!!

తీవ్ర తుఫాను కోనసీమ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. తుపాను వల్ల కోనసీమకు అపార నష్టం వాటిల్లింది. తుఫాను తీవ్రత తగ్గటంతో అధికారులు నష్టం అంచనాలు మొదలు పెట్టారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కేంద్రం కు ప్రాధమిక సమాచారం అందించారు. అండగా నిలవాలని కోరారు. ఇదే సమయంలో క్షేత్ర స్థాయి లో పర్యటించి.. నష్టం పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు నుంచి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే సాయం ప్రకటించారు.

ఆర్నాబ్ తుఫాను తీరని నిష్టం మిగుల్చింది. కోనసీమ తో పాటుగా ఉత్తరాంధ్ర తుఫాను ధాటికి చిగురాటుకులా వణికాయి. గోదావరి జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. దీంతో.. ప్రభుత్వం అక్కడ సహాయక చర్యలు వేగవంతం చేసింది. నష్టం బారిన పడిన వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. బాధితులకు పరిహారం ప్రకటించింది. ఇదే సమయంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి నష్టపోయిన వారికి భరోసా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఆయన తుఫాను ప్రభావం అత్యధికంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటన చేపట్టనున్నారు. నేరుగా క్షేత్ర స్థాయికి వెళ్లి పంట నష్టం, ఆస్తి నష్టాన్ని పరిశీలించడంతో పాటు పునరావాస కేంద్రాల్లోని బాధితుల ను, స్థానిక రైతులను కలిసి వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. పర్యటన అనంతరం జిల్లా కలెక్టర్లు, విపత్తు నిర్వహణ, రెవెన్యూ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలకు సిద్దం అయ్యారు.

ముంచుకొస్తున్న మరో ముప్పు, అల్పపీడనం - ఈ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు..!!
ముంచుకొస్తున్న మరో ముప్పు, అల్పపీడనం - ఈ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు..!!
cm-chandrababu-to-visit-cyclone-hit-areas-in-godavari-north-andhra-console-affected-families

బాధితులకు పరిహారం ప్రకటన

క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టం పరిశీలనతో పాటుగా.. బాధితులకు అందుతున్న సాయం పైనా సీఎం ఆరా తీయనున్నారు. ముంపు ప్రాంతాలకు తాగునీరు, నిత్యావసరాలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫోన్ లో తుఫాను ప్రభావం.. నష్టం పైన వివరించారు. అదే విధంగా లేఖ రాసారు. ప్రాధమికంగా సేకరించిన సమాచారం మేరకు వివరాలను అందించారు. సెంట్రల్ టీంలను పంపాలని సీఎం కోరారు. ఇప్పుడు తాజాగా క్షేత్ర స్థాయిలో పర్యటన తరువాత మరోసారి కేంద్రానికి పూర్తి స్థాయి నివేదిక పంపేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా.. ఈ రోజు ఏపీ కేబినెట్ వర్చ్యువల్ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా ఆర్నాబ్ తుఫాను కారణంగా జరిగిన నష్టం పైన చర్చించటం తో పాటుగా వారికి అండగా నిలవటం పైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+