గిరిజన యువతకు శుభవార్త చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుంది. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటం మాత్రమే వెనుకబడిన ప్రాంతాలు,గిరిజన ప్రాంతాలపైన కూడా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే ఏపీలోని గిరిజనుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలను తీసుకుంటూ ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుంది.
గిరిజన యువతకు శుభవార్త
గిరిజనుల చిన్నారులు బాగా చదువుకోవాలని మారికవలసలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటుచేసి వారికి ఇంటర్ తో పాటు నీట్, ఐఐటీ- జేఈఈ శిక్షణ ఇస్తుంది. ఇక ఈ క్రమంలోనే గిరిజనుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో శనివారం పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిరిజన యువతకు శుభవార్త వినిపించారు.

గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా జీవో
గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా చూస్తామని, ఈ మేరకు అందరికీ ఆమోదయోగ్యమైన జీవోను త్వరలోనే తెస్తామని కీలక ప్రకటన చేశారు. ఇదే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదికలో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతానికి వస్తే కొత్త శక్తి, ఉత్సాహం వస్తుందన్నారు.
గిరిజనుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం
అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన విషయాన్ని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. గిరిజనుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, సంజీవని యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు. మూడు నెలల్లోగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరచి, అన్ని రకాల వైద్య పరీక్షలు అక్కడే అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ నిబద్ధతను సీఎం చంద్రబాబు
ఏజెన్సీ ప్రాంతాల్లో మరిన్ని సెల్ టవర్లు నిర్మించి కనెక్టివిటీ పెంచుతామని, గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నామని వివరించారు. గన్నెల పర్యటనలో ఆర్కే నగర్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించి, ప్రభుత్వ సేవలు, గర్భిణుల సంరక్షణ, పిల్లల భవిష్యత్, పథకాల లబ్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు థింసా నృత్యంతో స్వాగతం పలికారు. గిరిజన సంక్షేమం, ఉపాధి, ఆరోగ్యంపై ప్రభుత్వ నిబద్ధతను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మరోసారి నొక్కి చెప్పారు.













Click it and Unblock the Notifications